నిజ వయసు కన్నా పదేళ్లు తక్కువ కనపడాలి అనుకుంటున్నారా...? వీటిని డైట్ లో చేర్చుకోండి...

kalpana
ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న వయసులోనే పెద్ద వయసు మాదిరి కనిపిస్తుంటారు. దీనికి కారణం మనం తినే ఆహారంలో మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. అలా జరక్కుండా ఉండాలంటే మీ డైట్ లో ఈ ఆహారాలను తీసుకోండి. అవి ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం...
 పెసలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. కానీ వాటిని మొలకల్లో వచ్చేటట్లు చేసి తినడం వల్ల  చాలా లాభాలుంటాయి. మొలకల్లో ఎంజైములు, యాంటీ  యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందుకే వీటిని తినాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. వీటిని తినడం వల్ల కాలేయము, జుట్టు, గోళ్లు కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
 మొలకలు తినడం వల్ల కొంచెం తిన్న కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా తక్కువ తింటారు.  దీనివల్ల బరువు తగ్గే అవకాశం ఉంది.                                              
 పెసలు రోజు తినడం వల్ల వారి నిజ వయసు కన్నా 10 ఏళ్ళ చిన్న వయసు గా కనబడతారు. ఎందుకంటే పెసల్లో ఉండే కాపర్ వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
 అజీర్తి  తో బాధపడే వాళ్ళు కి పెసలు బాగా ఉపయోగపడతాయి. ఇవే కొలస్ట్రాల్ను తగ్గిస్తుంది. అంతే కాకుండా వీటిలో ఉండే క్యాల్షియం వల్ల ఎముకలు దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే సోడియం కూడా ఉన్నందున దంతాలు, చిగుళ్ల సమస్యలు నివారిస్తుంది. బీపీ  ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది.
 పెసుల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల అన్ని అవయవాలకు ఆక్సిజన్ ను సక్రమంగా అందేటట్లు చేస్తుంది. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పిల్లల పెరుగుదలలో పెసులు ముఖ్య పాత్ర వహిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: