వేసవిలో ఎక్కువగా చెరుకు రసం తాగుతున్నారా..!

kalpana
సాధారణంగా వేసవికాలం మొదలవగానే రోడ్లపై చెరుకు రసం దర్శనమిస్తుంది.వేసవిలో వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల ప్రతి ఒక్కరి చూపు చల్లటి పానియాల వైపు మళ్ళుతుంది. ఈ క్రమంలోనే చాలామంది చెరుకు రసం తాగడానికి ఇష్టపడతారు. వేసవి కాలంలో అధిక మొత్తం చెరుకు రసం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.మన శరీరంలో జరిగే జీవ క్రియలను సరైన క్రమంలో ఉంచడమే కాకుండా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. చెరుకు రసం త్రాగటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..                             
వేసవి కాలంలో ఎక్కువగా చెరుకు రసం త్రాగటం వల్ల డీహైడ్రేషన్ సమస్య నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. అదేవిధంగా డీహైడ్రేషన్ వల్ల వడదెబ్బ తగలకుండా చెరుకు రసం మన శరీరాన్ని ఎప్పుడు హైడ్రేషన్ లో ఉంచుతుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కూడా చెరుకు రసంతో చెక్ పెట్టవచ్చు.చెరుకు రసంలో అధిక శాతం యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మన శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ ను బయటకు తొలగించడంలో దోహదపడుతుంది. చెరుకు రసంలో యాంటీఆక్సిడెంట్లు తో పాటు ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
శక్తిని కోల్పోయిన మన శరీరానికి చెరుకు రసం తక్షణ శక్తిని అందిస్తుంది. ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. మహిళల్లో ముఖ్యంగా సంతానోత్పత్తిని అభివృద్ధి చేయటంలో చెరుకు రసం దోహదపడుతుంది. అదేవిధంగా తల్లి పాలు అధికంగా ఉత్పత్తి అవడానికి,రుతుచక్రం సమయంలో వచ్చే నొప్పిని నివారించడానికి ఈ చెరుకు రసం ఎంతగానో దోహదపడుతుంది.అయితే వేసవిలో మాత్రమే కాకుండా మనకు లభించినప్పుడల్లా ఈ చెరుకు రసాన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: