గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. మాస్ ఎలిమెంట్స్ తో శంకర్ మార్క్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా గేమ్ చేంజర్ సినిమాను ఆవిష్కరిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ రిలీజ్ కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గేమ్ చేంజర్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ మెగా మూవీని కర్ణాటకలో నిరసన సెగ మొదలైంది. గేమ్ చేంజర్ సినిమా కన్నడ వెర్షన్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం కర్ణాటకలో తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేస్తూ ఉండడంపై అక్కడ ఈ సినీ అభిమానుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది.
కన్నడలో కాకుండా కేవలం ఇంగ్లీష్ లోనే పోస్టర్లు రిలీజ్ చేస్తుండడంపై అక్కడి అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా బెంగళూరులో పలుచోట్ల గోడలకు అంటించిన సినిమా వాల్ పోస్టర్లపై కలర్ స్ప్రే చల్లుతూ కొందరు కన్నడిగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు.
గేమ్ చేంజర్ సినిమా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రేపు జనవరి 4వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రానున్నారు. గేమ్ చేంజర్ సినిమా భారీగా కలెక్షన్లను రాబట్టాలని అభిమానులు ఆరాటపడుతున్నారు.