అలసటగా ఉందా.. అయితే ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల దూరం చేస్తాయి..!
ఉదయాన్నే టిఫిన్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే కడుపు ఖాళీగా ఉండడం వల్ల మనకు శక్తినిచ్చే గ్లూకోజ్, పోషకాలు, కార్బోహైడ్రేట్లు టిఫిన్ చేయడం వల్లనే వస్తాయి.
మధ్యాహ్నం భోజనం శక్తి, చురుకుదనం, కోసం కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. చురుకుదనాన్ని, మానసిక కేంద్రీకరణ అన్ని పెంచే న్యూరో ట్రాన్స్ మీటర్ ల కోసం ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి.
నీరు ఎక్కువగా తాగాలి. శరీరంలో తగినంత నీరు లేకపోతే పని సామర్థ్యం తగ్గుతుంది. శరీరంలో తగినంత నీరు లేకపోతే అన్ని అవయవాలకు రక్త ప్రసరణ తగ్గిపోయి మెదడు పనితీరు నెమ్మదిస్తుంది. అందుకే రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. దప్పిక అయ్యేంతవరకు ఉండకుండా అప్పుడప్పుడు నీరు తాగుతూ ఉండాలి.
ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు. దీనివల్ల తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయి. చేసే పని ఆధారముగా పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. భోజనం నీ మానేయకూడదు. ఇలా చేస్తే రక్తంలోనీ చక్కెర స్థాయిలు తగ్గి అలసట అనిపిస్తుంది. బయట చరిత్రలు తినడం మానుకోవాలి. ఎందుకంటే వీటిలో పోషక విలువలు ఉండవు. దీనివల్ల అలసట వస్తుంది.
ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల అలసట రాకుండా ఉంటుంది. బాగా సరఫరా కావడానికి ఐరన్ తోడ్పడుతుంది. ఐరన్ తక్కువ కావడం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. అందుకే ఐరన్ ఉన్న ఆహారాలు తీసుకోవడం మంచిది.
విటమిన్ సి ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిదే. ఎందుకంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రక్తకణాల తయారీకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అలసటను దూరం చేస్తుంది. అందుకే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.