కాలేయం శుభ్రపడాలి అంటే ఏం చేయాలో తెలుసా..?
కాలేయం మన శరీర భాగాలలో ఒక ముఖ్యమైన అవయవం.. ఇది మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి, బయటకు పంపిస్తుంది. ఒకవేళ అలా చేయకపోతే మన ఆరోగ్యం క్షీణించి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అందువల్ల కాలేయాన్ని మనం ఎప్పటికప్పుడు సంరక్షించుకోవాలి.. అయితే కొన్ని ఆహార పదార్థాలను, మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల కాలేయం శుభ్రంగా మారుతుంది అని అంటున్నారు నిపుణులు. అయితే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
కొబ్బరి నీళ్ళు :
కొబ్బరి నీళ్లు శరీరానికి ఎంతో మంచి ఉపకరణం చేస్తాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కేవలం చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా కాలేయ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. కొబ్బరి నీళ్ళలో ఉండే అనేక పోషణాల కారణంగా కిడ్నీలను సురక్షితంగా ఉంచుతాయి. అయితే కొబ్బరి నీళ్లను మితంగా మాత్రమే తీసుకోవాలి.
మంచినీళ్లు :
మంచినీళ్లు.. రోజుకు 5 నుంచి 6 లీటర్ల నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల కిడ్నీలో ఏర్పడిన రాళ్లు సైతం కరుగుతాయి. శరీరానికి కావలసిన తేమ అంది, శరీరం తాజాగా,ఆరోగ్యవంతంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి నీటిని తాగుతూ ఉండాలి.
అల్లం రసం :
ఉదయాన్నే పరగడుపున రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసం తాగడం వల్ల దగ్గు,జలుబు వంటి శ్వాసకోశ సమస్యలతో పాటు జీర్ణ సమస్యలు కూడా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ. అలాగే అల్లం రసం లో యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అంతేకాకుండా కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళను కూడా కరిగించవచ్చు.
నిమ్మరసం :
నిమ్మరసం లో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్-సి కిడ్నీలను శుభ్రం చేయడంతో పాటు కిడ్నీ లో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ :
ఆపిల్ సైడర్ వెనిగర్ అధికబరువును తగ్గించి, కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.