నీలగిరి ( యూకలిప్టస్ ) ఆయిల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో,, మీకు తెలుసా...?

kalpana
 నీలగిరి ఆకులతో అనేక ఔషధాలను తయారు చేస్తారు. ముఖ్యంగా జలుబు, తలనొప్పి వంటి వాటికి వాడే మందులు యూకలిప్టస్ ను వాడుతారు. అంతేకాకుండా ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
 నీలగిరి ఆకులతో తయారుచేసిన ఆయిల్ తో శరీరానికి మర్దనా చేస్తే శరీరం చల్లబడుతుంది. అంతేకాకుండా శరీరంలో వేడి పెరగకుండా చేస్తుంది.                                     
 యూకలిప్టస్ ఆయిల్ తో శరీర మర్దన చేయడం వల్ల శరీరంపై ఉన్న  అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది. అలాగే శరీరాన్ని తాజాగా ఉంచడమే కాకుండా ఉత్సాహాన్ని కలిగిస్తుంది.
 నీలగిరి  ఆకులు మంచి సువాసన వస్తాయి. చర్మంపై ఏర్పడే పుండ్లను, యోని సంబంధిత దురద సమస్యలను నివారించడానికి  బాగా ఉపయోగపడుతుంది.
 ఒళ్ళు నొప్పులు ఎక్కువ బాధపడుతున్నప్పుడు ఒక బకెట్ వేడినీళ్ళల్లో 2  కప్పుల యూకలిప్టస్ ఆయిల్ వేసి స్నానం చేయడం వల్ల కళ్ళు నొప్పులు తగ్గడమే కాకుండా హాయిగా నిద్ర పడుతుంది.
 శరీరంపై  ఏర్పడిన మచ్చలను తొలగించడానికి నీలగిరి ఆకుల ఆయిల్ను మచ్చలపై రాయడం వల్ల మచ్చలు తొలగిపోవడమే కాకుండా శరీరం కొత్త నిగారింపును సంతరించుకుంటుంది.
 పురుషులు సేవ్ చేసుకున్న తర్వాత యూకలిప్టస్  ఆయిల్ ను ముఖంపై  రాసుకోవడం వల్ల ముఖం పై పడే గాట్లు పోవడమే కాకుండా, ముఖం  అందంగా కనిపిస్తుంది.
 శరీరం పొడిబారినట్లు ఉంటే శనగపిండిలో కొంచెం యూకలిప్టస్ ఆయిల్ వేసి శరీరానికి నలుగు పెట్టుకుంటే పొడిబారిన  చర్మం మెత్తగా అవుతుంది.
 మనం పళ్ళు తోముకునే పేస్టు లో కొంచెం యూకలిప్టస్ ఆయిల్ కలిపి పళ్ళు తోముకోవడం వల్ల పళ్లు దృఢంగా అవడమే కాకుండా, చిగుళ్లు  నుంచి కారే రక్తం ఆగిపోతుంది. ఇంకా దంతాలు బాగా మెరుస్తాయి.
 తలలో పేలు ఉన్నవాళ్లు నీలగిరి తైలాన్ని తలకు బాగా మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల పేల సమస్య తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: