నల్ల ఉప్పు ఆరోగ్యానికి చాలా మంచిదని, మీకు తెలుసా...?
నల్ల ఉప్పును ఒక గ్లాస్ నీటిలో వేసుకుని ప్రతిరోజు తాగడం వల్ల ఒక సమస్య నివారించబడుతుంది.అంతేకాకుండా గ్యాస్ సమస్యతో బాధపడే వాళ్ళు చిటికెడు నల్ల ఉప్పు తింటే ఉపశమనం కలుగుతుంది.
వేసవికాలంలో శరీరాన్ని చల్ల పరచుకునేందుకు చల్లని కూల్ డ్రింక్ తాగుతున్నాము. చల్లటి పానీయాలను బదులు చిక్కటి నల్ల ఉప్పును గ్లాసు నీళ్లలో వేసుకుని తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది.
అసిడిటీ, మంట, కడుపుబ్బరం సమస్యలతో బాధపడుతున్నప్పుడు నల్ల ఉప్పు తినడం వల్ల ఈ సమస్యలన్నీ తీరుతాయి.
నల్ల ఉప్పును చర్మంపై సున్నితంగా రుద్దీ స్నానం చేయడం వల్ల బ్లాక్ హెడ్స్రా రావడం,చర్మం పొడిబారటం,మొటిమలు రావడం ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు.
సగం బకెట్ నీళ్ళలో కొద్దిగా నల్ల ఉప్పు కలిపి పాదాలను బకెట్లో పదహైదు నుంచి ఇరవై నిమిషాల దాకా అలాగే ఉంచి ఆ తర్వాత పాదాలను కడగడం వల్ల పాదాల పగుళ్లు, నొప్పి తగ్గిపోతాయి.అందుకే నల్ల ఉప్పు వాడటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ఈ ఉప్పు వాడడం చాలా మంచిది.