పైల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా చేయండి..

Divya

ప్రస్తుత కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మొలల సమస్యతో బాధపడుతున్నారు. వీటిని వైద్యvపరిభాషలో పైల్స్ అని కూడా  అంటారు. ఈ పైల్స్ కారణంగా మూత్ర విసర్జన సరిగ్గా చేయకపోగా ఎన్నో ఇబ్బందులకు గురి అవుతుంటారు. ముఖ్యంగా మరీ 20 సంవత్సరాల దాటగానే ఈ సమస్య అధికమవుతోంది . ఈ సమస్యకు గల కారణం ఆహార లోపం అయినా ఉండొచ్చు లేదా శరీరంలో కలిగే మార్పుల వల్ల అయినా అయి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒకసారి వచ్చిన పైల్స్ ను  పోగొట్టుకోవడం అసాధ్యం. అలాంటిది ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఎలాంటి పైల్స్ సమస్యనైనా దూరం చేసుకోవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటిస్తే నయం అవుతుందో  ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.

ముల్లంగి:
ముల్లంగి రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చని మనకు తెలుసు. మరీ ముఖ్యంగా ముల్లంగిని మొలల సమస్యతో బాధపడుతున్న వారు తినడం వల్ల,అతి తక్కువ సమయంలోనే పైల్స్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.
తమలపాకు:
తమలపాకు కూడా మొలల సమస్య నుంచి విముక్తి పొందే శక్తి ఎక్కువగా ఉంది. తమలపాకుకు ఆముదం రాసి కొద్దిగా వెచ్చచేసి పడుకునే ముందు మొలలు వచ్చిన చోట, నొప్పి ఉన్న ప్రదేశంలో కట్టులా కట్టాలి. ఇలా చేయడం వల్ల కొద్దిగా ఉపశమనం కలుగుతుంది.
క్యాబేజీ:
క్యాబేజీ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది అని అందరికీ తెలుసు. అలాంటి క్యాబేజీని రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మొలల సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.
పుచ్చకాయ మొక్క :
పుచ్చకాయ మొక్క యొక్క వేరును అరగదీసి,మొలల కారణంగా వచ్చే నొప్పి ఉన్నచోట లేపనంలా  రాయడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
కాకరకాయ:
కొంతమందిలో రక్తాన్ని విసర్జించే మొలల  సమస్య కూడా ఉంటుంది. అలాంటి వారు కాకరకాయ రసంలో చక్కెరను కలిపి తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
అడవి కంద గడ్డ:
అడవి కందగడ్డ ని తీసుకొని బాగా ఉడికించి రొట్టెలాగ  చేసుకుని,కాల్చుకొని తినడం వల్ల మొలల  సమస్య నుంచి బయటపడవచ్చు.
దానిమ్మ తొక్కలు:
దానిమ్మ తొక్కలను నీళ్లలో వేసి ఉడికించి, కషాయం చేసుకుని రోజుకు రెండు పూటలా తాగడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: