ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని ఆహారంలో చేర్చుకోవాలి...

kalpana
 అత్యంత ప్రాచీన ధాన్యము ఉలవలు. వీటితో రసం చేసుకోవచ్చు, ఉడకబెట్టి గుగ్గుల,రూపంలోనూ తీసుకోవచ్చు. వీటిని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎందుకంటే ఉలవల్లో ఫైబర్, పాస్పరస్, ఐరన్,క్యాల్షియం అధికంగా ఉంటాయి.శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఈ ప్రొటీన్ ఉండడంవల్ల ఎదిగే పిల్లలకు చాలా మంచి ఆహారం.ఇంకా శరీరంలోని కొవ్వు కరగడానికి సహాయపడతాయి.ఉలవలు వాడడం వల్ల బరువు తగ్గుతారు.రక్తపోటును నియంత్రించడం లోనూ వలవల సాయపడతాయి. ఉలవల్లో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం.
 ఉలవలు తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.  కాబట్టితక్కువ తింటారు.ఇందులో ఉండే పిండి పదార్థాలు ఆకలిని తగ్గిస్తాయి. ఫలితంగా బరువు తగ్గుతారని వైద్యులు సూచిస్తున్నారు.
 ఉలవలను, కొత్త బియ్యాన్ని సమానంగా తీసుకొని జావా తయారు చేసుకునే ఈ జావను పాలతో కలిపి క్రమం తప్పకుండా కొన్ని వారాలు తీసుకోవడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుంది.
ఉలవలు ఒక పిడికెడు తీసుకొని పెనం పైన బాగా వేయించి,ఒక గుడ్డలో కట్టి కాళ్లు, చేతుల్లో నొప్పి ఉన్నచోట కాపడం పెట్టడం వల్ల నొప్పులు తగ్గుతాయి.
 ఒక కప్పు ఉలవచారు కి ఒక కప్పు కొబ్బరి నీళ్లు కలిపి తీసుకోవడం వల్ల, మూత్రంలో మంట తగ్గి, మూత్రం ఫ్రీగా పోతుంది.
 ఒక టీస్పూను ఉలవ ఆకు రసానికి ఒక అరటిపండు కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల విరేచనాలు తగ్గుతాయి.                                                                                                                                                                                                                                            
 అజీర్ణ సమస్య ఉంటే ఉలవలను మొలకలు వచ్చేలా చేసి రోజు పరగడుపున తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది.మధుమేహం కూడా తగ్గుతుంది
 ఉలవల పొడి, పుట్టమన్ను సమానంగా తీసుకొని బాగా కలపాలి, దీనికి గుడ్డులోని తెల్ల సొనను వేసి కలిపి బోదకాలు ( కాళ్ళు వాపు) ఉన్నచోట లేపనం చేయాలి. ఇలా చేయడం వల్ల బోదకాలు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: