బద్ధకం ఆవహిస్తోందా మీకు? ఐతే ఇలా చేయండి మీరు

Divya

మనం ప్రతిరోజూ తీసుకునే ఆహార పదార్థాల వల్ల కానీ, వాతావరణంలో మార్పుల వల్ల కానీ శరీరం బద్దకంగా అనిపిస్తుంది. ఇలా బద్ధకంగా అనిపించినప్పుడు ఎలాంటి పని సవ్యంగా చేయలేము. అంతేకాక లేనిపోని రోగాలు వస్తుంటాయి. ఏది తిన్నా సరిగ్గా జీర్ణం అవ్వదు.బద్దకం కారణంగా పనులన్నీ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో మరీ ఎక్కువగా శరీరం బద్దకిస్తుంది.ఇలాంటి అన్ని కారణాలకు ఏం చేయాలో తెలియక మనలో చాలామంది సతమతమవుతుంటారు.విలువైన జీవితం లో ఆరోగ్యం చాలా ప్రధానమైనది.శరీరం సరైన స్థితిలో లేకపోతే అనారోగ్యం దరి చేరుతుంది. ఫలితంగా జీవితమే అస్తవ్యస్తం అవుతుంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యం వేధిస్తూనే ఉంది.

అయితే కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఆరోగ్యంతో పాటు జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉండేలా చేసుకోవచ్చు. ఆ పద్ధతులు ఏంటో? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం సూర్యోదయానికి అరగంట ముందే నిద్ర లేవాలి. పూర్వం మన పెద్దలు తెల్లవారుజామున లేచేవారు. ఉదయం పూట తొందరగా లేవడం వల్ల బద్ధకం మన దరిచేరదు.కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకోవాలి. సూర్య నమస్కారాలు ఎందుకు చేసుకోవాలంటే ఉదయం సూర్యుని నుండి వెలువడే కిరణాలలో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్-డి ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఉదయం పూట సూర్యుని నుండి వెలువడే కిరణాలు వల్ల చర్మం కాంతులీనుతుంది. అంతేకాకుండా బద్ధకం తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు.పూర్వం ఋషులు మునులు కూడా ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసేవారు.

ప్రాణాయామం, కపాల భీతి వంటి ఆసనాలను పాటించడంవల్ల  రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.సరైన ఆసనాలతో పాటు సరైన ఆహారపు అలవాట్లు కూడా ఎంతో ముఖ్యం. ఉదయాన్నే పరగడుపున మొలకెత్తిన గింజలు,ద్రాక్ష,దానిమ్మ,తాజా పండ్లు, పాలు, గుడ్లు వంటివి అల్పాహారంగా తీసుకుంటూ ఉండాలి.వీలైనంత వరకు మీ చుట్టూ  ప్రదేశం  గాలి, వెలుతురు లతో ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా మైండ్ ప్రశాంతంగా ఉండటానికి దోహదపడుతుంది.

అనవసర వ్యక్తుల గురించి, అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం మానేయాలి. తద్వారా మీకు సమయం ఆదా అవ్వడం తోపాటు ఒత్తిడి కి గురి కాకుండా వుంటారు. ధూమపానం మద్యపానం లాంటి వ్యసనాల నుండి దూరంగా ఉండాలి. అంతేకాకుండా కూరల్లో ఉప్పు కారం మసాలా దినుసులు నూనెలు ఎక్కువగా వాడటం తగ్గించాలి.సమయాన్ని బట్టి ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలి. సరైన సమయానికి భోజనం చేయడం వంటి అలవాట్లను అలవరచుకోవాలి. అంతేకాకుండా తాజా ఆహారాన్ని తీసుకోవడానికి ఆసక్తి  చూపాలి. తిన్న వెంటనే నిద్ర పోవడం లాంటి అలవాట్లను మానుకోవాలి. అంతేకాకుండా సమయానికి నిద్ర అంటే రోజుకు ఎనిమిది గంటల నిద్ర ఆరోగ్యానికి మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: