కండరాల తిమ్మిరితో బాధ పడుతున్నారా? అయితే ఇవి రోజు తినండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి......చాలా మంది కండరాల తిమ్మిరితో ఎంతగానో సతమతమవుతూ వుంటారు. అలా బాధపడకుండా ఉండటానికి రోజు ఈ ఆహార పదార్ధాలు తీసుకోండి.... కండరాల తిమ్మిరి రాకుండా ఉండడం కోసం అరటి పండ్లు తినండి. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది కాబట్టి  ఈ పండుని తీసుకొండి. ఈ పండులో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వల్ల ఎలెక్ట్రొలైట్ బ్యాలెన్స్ మెయింటెయిన్ అవుతుంది.కండరాల నొప్పి తిమ్ముర్లు తగ్గుతాయి. చిలకడ దుంప సమృద్ధమైన శక్తిని ఇస్తుంది. విటమిన్స్ ఏ, సీ, డైటరీ ఫైబర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఈ దుంప లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి.


ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కానే కాక గాయాలు తగ్గించడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ దుంప లో ఉండే హై పొటాషియం కంటెంట్ వల్ల కండరాల తిమ్ముర్ల ని రెడ్యూస తగ్గించుకోవచ్చు. సాల్మన్, సార్డీన్స్, ట్యూనా వంటి ఫ్యాటీ ఫిష్ లో ఈపీఏ, డీహెచ్ఏ రూపంలో ఒమేగా 3 ఫ్యాట్స్ లభిస్తాయి. వీటికి కల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల జాయింట్ పెయిన్స్, మజిల్ సోర్‌నెస్ నుండి రిలీఫ్ లభిస్తుంది. అంతే కాక, కొన్ని రకాల ఫ్యాటీ ఫిష్ లో మజిల్ స్పాజం ని రిలీవ్ చేసే విటమిన్ డీ కూడా ఉంటుంది. అలాగే, ఫ్యాటీ ఫిష్ లో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, సెలీనియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి.కొబ్బరి నీటిలో కూడా పొటాషియం లభిస్తుంది. అంతే కాక కొబ్బరి నీటిలో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. ప్రకృతిలో సహజం గా లభించే ఈ పానియం రుచికీ ఆరొగ్యానికీ పెట్టిన పేరు. ఇది కండరాల తిమ్మిరి నుండి కూడా రిలీఫ్ ని ఇస్తుంది.


ఇందులో ఉండే అమైనో యాసిడ్స్ వల్ల కొబ్బరి నీరు ఒత్తిడి తగ్గించి మజిల్ రికవరీని సపోర్ట్ చేస్తుంది.పుచ్చకాయ మంచి రుచిగా ఉండడమే కాదు, కండరాల తిమ్మిరి నుండి రిలీఫ్ ఇచ్చే వాటిలో ఇది మొట్టమొదటగా కూడా ఉంటుంది. ఇందులో నీరు, ఫ్లూయిడ్ ఎలెక్ట్రోలైట్ బ్యాలెన్స్ ని మెయింటెయిన్ చేసే పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలం గా ఉంటాయి. అంతే కాక పుచ్చకాయ లో ఉండే సిట్రులిన్ అనే అమైనో యాసిడ్ బ్లడ్ ఫ్లో ని ఇంప్రూవ్ చేయడం లో హెల్ప్ చేస్తుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: