శాఖాహారం ఆరోగ్యానికి చాలా మంచిది.. కాబట్టి రోజు ఈ ఫుడ్స్ తినండి...!

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....శాఖాహారం మన భారతదేశ చరిత్రలో చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికిన వాళ్ళు శాఖాహారులు. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి శాఖాహారం చాలా మంచిది. ఆరోగ్యంగా ఉండాలంటే మన బాడీకి విటమిన్ ఏ అనేది చాలా ముఖ్యం...  క్యారెట్స్, చిలగడ దుంపల్లో విటమిన్ ఏ ఉంటుంది.విటమిన్ ఏ ఉన్న ఫుడ్స్ స్వేద గ్రంధులని కుదించి, స్వేద రంధ్రాల సైజుని రెడ్యూస్ చేసి, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ ని తగ్గిస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలపరుస్తాయి.పాల కూర, క్యాబేజ్, మెంతి కూర - ఇలాంటి వన్నీ తెచ్చుకుని రోజూ కనీసం ఒకటైనా తినాలని నియమం పెట్టుకోండి.

ఆకు కూరలు మీ ఆరోగ్యానికి  ఎంతో మేలు చేస్తాయి.అలాగే పప్పు ధాన్యాలు, కాయ ధాన్యాలు ఎక్కువగా తినండి. వీటిలో ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్ మన ఆరోగ్యానికి సంబంధించిన  అన్ని రకాల సమస్యల  నుండి రక్షిస్తాయి. వీటిలో ఉండే ఎమైనో యాసిడ్స్ షుగర్ గా రూపాంతరం చెందవు.అందువల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము... ఇంకా ప్రతి సీజన్లో దొరికే పండ్లు తినండి.. పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కాబట్టి ప్రతి సీజన్లో లభించే పండ్లు తింటం చాలా ముఖ్యం...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: