శరీరంలో అవయవాలకు ఆక్సిజన్ బాగా అందాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే....?
భారత్ పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా సోకిన వాళ్ల రక్తంలో 90 శాతం వరకూ ఆక్సిజన్ నిల్వలు ఉంటే ఎలాంటి సమస్య లేదు. 90 శాతం కంటే తగ్గితే మాత్రం వైద్యులను సంప్రదించాలి. 85 శాతం కంటే తగ్గితే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు భావించాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు ఆక్సిజన్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.
మన శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ బాగా సరఫరా కావాలంటే ఐరన్ అవసరం. ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్యతో బాధ పడేవాళ్లు ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవాలి. చిన్నపిల్లల నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న పురుషులకు 8 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం కాగా స్త్రీలకు 18 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం.
కూరగాయలు, ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది. బీన్స్, ఆలుగడ్డలు, పచ్చి బఠానీల నుంచి కూడా ఐరన్ లభిస్తుంది. టమాటా, బ్రొకొలి, పిస్తా, బాదం పప్పు, మటన్ లివర్, పల్లీల ద్వారా కూడా ఐరన్ ను పొందవచ్చు. కొత్తీమీర, అవకాడో, కోడిగుడ్లు, యాపిక్రాట్స్ లలో కూడా ఐరన్ ను పొందవచ్చు. ఈ ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్య దూరం కావడంతో పాటు అవయవాలకు ఆక్సిజన్ బాగా అందుతుంది.
ఆక్సిజన్ లెవెల్స్ ను చెక్ చేసుకోవడానికి డిజిటల్ పల్సాక్సీ మీటర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నడక, ప్రాణాయామం వంటివి ఆక్సిజన్ లెవెల్స్‌ను పెంచుతాయి. 90 శాతం కంటే ఆక్సిజన్ ఎక్కువ ఉంటే ఊపిరితిత్తుల్లో సమస్య లేదని అర్థం. ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవడం ద్వారా ప్రమాదాన్ని ఊహించి ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు.