ఆరోగ్యం: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఏం అవుతుందో తెలుసా..?
సాధారణంగా చాలా మందికి నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. అది కొందరికి ఎంతా అంటే.. టీ కడుపులో పడందే రోజు గడవనంత అని చెప్పాలి. అయితే నార్మల్ టీ కాకుండా ఉదయాన్నే అల్లం టీ తాగితే ఏం అవుతుందో తెలుసా..? తెలియకపోతే ఓ లుక్కేసేయండి. పోయేదేముంది..! అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని ఎప్పట్నుంచో చెబుతున్నారు. విటమిన్ సి, మెగ్నిషియం, ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి మేలు చేస్తుంది. అయితే అల్లం టీ కూడా ఆరోగ్యానికి మంచిదేనండోయ్.
అల్లంలోని జింజరాల్స్, జింజెరాన్‌లు రక్తప్రసరణకు తోడ్పడుతాయి. రక్తనాళాల్లో పేరుకున్న అడ్డంకులను తొలగించి.. గుండె వ్యాధులు రాకుండా కాపాడుతాయి. అల్లం టీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే అల్లం టీ తాగడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది. వికారం, అలసట ఉన్నప్పుడు ఓ కప్పు అల్లం టీ తాగితే వెంటనే రిలీఫ్ వస్తుంది. ఇందులోని జింజిబర్ అనే పదార్థం హానికర బ్యాక్టీరియాని తొలగించి జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తుంది. తేన్పుల్నీ తగ్గిస్తుంది.
టైప్ 2 డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకి షుగర్ లెవల్స్ తగ్గించడంలో అల్లంటీ భేషుగ్గా పనిచేస్తుంది. దీన్ని తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. అల్లం టీ తాగితే దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలకు చక్కని ఉపశమనం కూడా లభిస్తుంది. మరియు రోగ నిరోధక శక్తిని పెంచడంలో అల్లం టీ గ్రేట్‌గా పనిచేస్తుంది. అయితే అన్నింటికి మంచి కదా అని ఎక్కువగా తాగడం వల్ల అనర్థాలు తప్పవు. అల్లం ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంటగా ఉండి.. చికాకు కలిగిస్తుంది. సో.. బీ కేర్ఫులండోయ్..!