నోట్లో వేలు పెట్టుకునే అల‌వాటు ఉందా... ఏం జ‌రుగుతుందో తెలుసా..

Kavya Nekkanti
చిన్నారులు నోట్లో వేలు పెట్టుకోవడం స‌ర్వ‌ సాధారణం. వాస్త‌వానికి శిశువు గర్భంలో ఉన్నప్పటి నుండి తమ బ్రొటనవేలును నోట్లో పెట్టుకుంటారు. ఆ అలవాటు బయటకు వచ్చిన తర్వాత కూడా కొనసాగే  అవకాశం ఉంది. పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా వేలును నోట్లో పెట్టుకుంటారు. ఆకలిగా ఉన్నప్పుడు, ఒంటరిగా, అసౌకర్యంగా ఉన్నప్పుడు, చనుబాలు తాగాలని అనిపించినప్పుడు పిల్లలు నోట్లో వేలు వేసుకుంటూ ఉంటారు.


సాధారణంగా ఈ అలవాటు చనుబాలు తాగే పిల్లల్లో కంటే సీసాపాలు తాగే చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సహజంగా రెండు మూడేళ్లు నిండేసరికి పిల్లలు తమంతట తామే ఈ అలవాటును మానుకొంటారు. అయితే.. కొందరు పిల్లల్లో ఐదేళ్లు వచ్చినా ఈ అలవాటు కనిపిస్తుంది. దీనివల్ల దవడలు, దంతాల ఆకృతి మారిపోతుంది. అంతేగాక చేతివేళ్లు నోట్లో పెట్టుకోవడం మూలంగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.


అయితే.. కొన్ని జాగ్రత్తలు పాటించటం ద్వారా పిల్లలతో ఈ అలవాటును మాన్పించవచ్చు.సాధారణంగా వయసుతో బాటు పిల్లలు ఈ అలవాటును తమంతట తామే మానేస్తుంటారు. కానీ కొందరు మానరు. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు. పిల్లలు నిద్రించే సమయంలో మెల్లిగా వారి నోట్లోంచి వేలును తీసివేయాలి. అయితే వయసు 4 ఏళ్ళకు మించక ముందే ఈ అలవాటును మాంపించాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: