చలికాలంలో అల్లం ఎంత మేలు చేస్తుందో తెలుసా?

Purushottham Vinay
చలికాలంలో అల్లం ఎంత మేలు చేస్తుందో తెలుసా? అల్లం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఈ చలికాలంలో అయితే అల్లం చాలా రకాలుగా మేలు చేస్తుంది.మీ రోజువారీ ఆహారంలో భాగంగా అల్లాన్ని తీసుకోవడం వల్ల  చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను చాలా ఈజీగా నియంత్రించవచ్చు. అల్లం పచ్చడి ఇంకా అలాగే అల్లం రసం తీసుకున్నా కూడా ఆరోగ్యానికి మంచి ఫలితం ఉంటుంది.ఇక చలికాలంలో చాలా మంది వ్యక్తులకు కూడా దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ అనేవి చాలా పెద్ద సమస్యలుగా వేధిస్తూ ఉంటాయి. అందుకే అర టేబుల్ స్పూన్ తేనెలో కొన్ని చుక్కల అల్లం రసం వేసి పడుకునే ముందు తాగితే ఈ సమస్య నుంచి చాలా ఈజీగా ఉపశమనం లభిస్తుంది. ఒక్క రోజులోనే మీరు ఉపశమననాన్ని పొందుతారు.సహజంగా లభించే జింజెరాల్ అనే పదార్థం అల్లంలో చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను బాగా మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది.అందువల్ల చాలా మంది కూడా తమ ఆహారంలో అల్లంని ఎక్కువగా ఉపయోగిస్తారు.


చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గిన వెంటనే తుమ్ములు, దగ్గు రావడం చాలా సహజం. జలుబు ఇంకా ఫ్లూ నివారణగా అల్లంను చాలా కాలం నుంచే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వివిధ వంటకాలలో లేదా పానీయాలలో అల్లం రసం లేదా తురిమిన అల్లంని కలపడం ద్వారా బలుబు ఇంకా అలాగే ఫ్లూ నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చు.ఈ అల్లం అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండడం వల్ల ఇది వాపును తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా అంతేగాక ఆర్థరైటిక్ లక్షణాలను నిర్వహించడానికి ఇది మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే క్రమం తప్పకుండా అల్లంని తీసుకోవడం వల్ల నొప్పి ఇంకా వాపు నుంచి వెంటనే ఉపశమనాన్ని పొందవచ్చు.దీనిని మీరు నోటి ద్వారా తీసుకున్నా లేదా చర్మానికి నేరుగా రాసుకున్నా కూడా మీకున్న సమస్యలను చాలా ఈజీగా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: