శరీరానికి అవసరమని విటమిన్ డి ని ఎక్కువగా తీసుకుంటున్నారా..అయితే జాగ్రత్త..!!

Divya
విటమిన్ డి ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.ఇది రోగనిరోధక పెంచడంలో సహాయపడుతుంది. కండరాల కణాల అభివృద్ధికి అడ్డుపడుతుంది.ఉదయాన్నే ఎండలో ఉండటం వల్ల అధిక' డి విటమిన్ 'లభిస్తుంది. కానీ ఉదయాన్నే ఎండలో నిలబడేందుకు సమయం లేక చాలామంది డి విటమిన్ ట్యాబ్లెట్స్‌ను అధికంగా వాడుతున్నారు. అయితే, డి విటమిన్ అధికంగా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కూడా కలుగతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ సైడ్ ఎఫెక్ట్స్‌కు సంబంధించి లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
విటమిన్ డి లోపం లక్షణాలు..
విటమిన్ డి లోపంతో  చాలా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలసట, బలహీనత, ఎముకల పేలుసుభారడం , కండరాల నొప్పులు , కాళ్ళు, చేతులు తిమ్మిర్లు,మానసిక ఆందోళన ఏర్పడుతుంది.
విటమిన్ డి సప్లిమెంట్లు ఎప్పుడు తీసుకోవాలి..
విటమిన్ డి ఇది ఒక రకమైన హార్మోన్. ఇది సూర్యరశ్మికి శరీరాన్ని తాకినప్పుడు చర్మం నుండి రిలీజ్ అయ్యో స్టెరాయిడ్ హార్మోన్. ఇది చాలాతక్కువ ఆహారాలు మాత్రమే ‘విటమిన్‌ డి’ ని అందిస్తాయి. కానీ, తగినంత సూర్యరశ్మి తగలనప్పుడు విటమిన్ డి లోపానికి దారితీస్తుంది.
విటమిన్ డి అధికంగా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు..
శరీరంలో విటమిన్ డి ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో కాల్షియం స్థాయిని పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి హానీ చేస్తుంది.శరీరంలో సాధారణ స్థాయిని మించిపోయినప్పుడు వికారం, వాంతులు, బలహీనత, తరచుగా మూత్రవిసర్జన, జీర్ణశయ సమస్యలు తలెత్తుతాయి.
శరీరంలో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల కాల్షియం, హార్మోన్లు కలిసి ఎముకలకు కాల్షియం, అందండంలో అడ్డుపడుతుంది. ఇది రానురాను కీళ్ల నొప్పులకు దారి తీస్తుంది. ఎముక ఆరోగ్యం దెబ్బతింటుంది.
మూత్రపిండ సమస్యలు..
విటమిన్ డి అధికమవడంలో హైపర్‌కాల్సెమియా కూడా మూత్రపిండాల సమస్యలకు దారి తీస్తుంది. రక్తంలో విటమిన్ డి అధిక మవడం వల్ల, మాటిమాటికి మూత్రవిసర్జన జరుగుతుంది. శరీరాన్ని డిహైడ్రెట్ కి గురవుతుంది.
ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డి విటమిన్‌ను తీసుకోవడం నిలిపివేయాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: