షుగర్ వున్నవారు అస్సలు దీన్ని తినకండి?

Purushottham Vinay
షుగర్ వ్యాధి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన జీవన శైలిలో కొంచెం మార్పు వచ్చినా కూడా ఖచ్చితంగా షుగర్ రావడం ఖాయం. ఇక ముఖ్యంగా మన దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకూ చాలా ఎక్కువగా పెరిగిపోతోంది. జీవనశైలి, తినే ఆహారం, నిద్రలేమి, ఒత్తిడి, కుటుంబ చరిత్ర తదితర కారణాల వల్ల ఎంతో మంది కూడా డయాబెటిస్‌ బారిన పడుతున్నారు.ఈ సమస్య వస్తే చచ్చేదాకా కూడా ఇంకా వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.ఇక మధుమేహం ఉన్నవారు ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి లేకపోతే షుగర్స్‌ లెవల్‌ పెరిగిపోతే సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండటం మంఇచది. వీరు కొన్నింటికి దూరంగా ఉండటం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. మామిడి పండు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పండు. ఇవి మధుమేహ రోగులకు అస్సలు మంచిది కాదు. షుగర్‌ లెవల్స్‌ను పెంచుతుంది.అరటిపండు చాలా సాధారణమైన పండు. ఇది ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది.


ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. అయితే ఇది డయాబెటిక్ రోగులకు మంచిది కాదు. ఎందుకంటే ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ వారి ఆరోగ్యానికి మంచిది. ఎంతో హానికరంగా భావించాలి.బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో పండించే లీచీని చాలా మంది ఇష్టపడతారు.అయితే ఇందులో 16 గ్రాముల చక్కెర ఉంటుంది అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని దూరంగా ఉంచమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పైనాపిల్ కూడా అంత మంచిది కాదంటున్నారు. ఇందులో ఉండే అధిక చక్కెర మధుమేహ రోగులకు ఇబ్బంది కలిగిస్తుంది. లేకపోతే రక్తంలో గ్లూకోజ్ స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇవి తిన్నా చాలా తక్కువ తినడం మంచిదంటున్నారు.అలాగే షుగర్ వ్యాధి వున్నవారు ఆక్యూ ప్రెజర్ చెప్పులు వాడటం చాలా మంచిది అంటున్నారు నిపుణులు.కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: