బాదం: ఇలా తింటున్నారా? అయితే సమస్యలు తప్పవు?

Purushottham Vinay
బాదంపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది.దీనిని తీసుకోవడం వల్ల మెదడు బాగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా అలాగే జ్ఞాపకశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. అయితే ఈ హెల్దీ సూపర్‌ ఫుడ్స్‌ ఎక్కువగా పర్వత ప్రాంతాలలో కనిపిస్తుంటాయి.ఇరాన్, ఇరాక్, మక్కా ఇంకా షిరాజ్ వంటి ఆసియాలోని అనేక ప్రదేశాలలో బాదం చెట్లు ఉంటాయి. వీటిని సరిగ్గా తింటే మెదడులోని న్యూరాన్‌ల పనితీరు మెరుగుపడుతుంది. అయితే చాలామందికి బాదంపప్పును ఎలా తీసుకోవాలో తెలియలేదు.ముఖ్యంగా బాదంపప్పులో టానిన్ సాల్ట్ సమ్మేళనం ఉన్నందున ఈ కారణాల వల్ల బాదంపప్పులను వాటి తొక్కలతో కలిపి తినవద్దు. దీన్ని తీసుకోవడం వల్ల బాదంలోని పూర్తి పోషకాలు శరీరానికి అందవు. అందుకే బాదంపప్పును వాటి తొక్కతో కలిపి తినకూడదు. చాలా మంది ఆకలితో బాదంపప్పును అలాగే తింటారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిదికాదు. బాదంపప్పును నీళ్లలో నానబెట్టి పొట్టు తీసి తింటే అందులోని పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి.తొక్కతో ఒకసారి తింటే, శరీరంలో పిత్త అసమతుల్యత పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా అనేక వ్యాధులు ఇబ్బందిపెడతాయి. 


పొట్టు తీయని బాదంపప్పులను తినడం వల్ల, కొన్ని బాదం పప్పులు మీ పేగుల్లో చిక్కుకుపోయే అవకాశం ఉంది. దీని వల్ల కడుపునొప్పి, గుండెల్లో మంట, గ్యాస్ట్రిక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.బాదంపప్పును ఎలా తీసుకోవాలంటే?బాదంపప్పును ఇంట్లో వంటలు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అయితే బాదం పప్పును రోజూ తినే వారు ఈ విధంగా బాదం పప్పును తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.బాదంపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టండి.ఉదయాన్నే పొట్టు తీసి తినాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.బాదంపప్పును ఉదయాన్నే మెత్తగా చేసి పాలలో కలుపుకోవచ్చు.ఈవినింగ్ స్నాక్ గా కూడా వేయించి తినవచ్చు. పోషకాహార నిపుణులు రోజుకు 5-8 బాదంపప్పులు తినాలని సిఫార్సు చేస్తున్నారు.కాబట్టి పైన చెప్పిన విధంగా బాదం పప్పుని తినండి. ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: