పాదాల వాపు కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఈ నూనె రాస్తే సరిపోతుంది..!!

Divya
పనిచేస్తూ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పాదాల వాపు నొప్పి కూడా వస్తూ ఉంటుంది. వాస్తవానికి ఇలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మన కాళ్లకు రక్తసరఫరా అనేది తగ్గిపోతుందట. దీనివల్లనే కండరాల నొప్పులు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి పెయిన్ కిల్లర్స్ ను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. అయితే తరచూ పెయిన్ కిల్లర్లు తీసుకోవడం వల్ల ఇది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇలాంటి పరిస్థితులలో ఆముదం నూనె బాగా పనిచేస్తుందట. కాళ్లలో వాపు నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రతి రోజు రాత్రి సమయాలలో ఆముదంతో పాదాలకు మసాజ్ చేస్తే.. విముక్తి కలుగుతుంది. ఇప్పుడు ఆముదం వల్ల ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం.
1).ఆముదం నూనె లో ఇన్ఫర్మేషన్ తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి.. అందుకే ఆముదం కూడా బాగా ఉపయోగపడుతుంది. వేడిచేసిన ఆముదం ఆకులపైన రాసి కాళ్లవాపు ఉండే చోట వాటిని కడితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒకవేళ ఆముదం మాకులు లేకపోయి నట్లయితే.. ఆముదం తోనే వాపు ఉన్నచోట మసాజ్ చేసి గుడ్డతో చుట్టాలి.

2). ఆముదం నూనె ఎక్కువగా గాయాలను నయం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా కణజాల పెరుగుదలకు కూడా బాగా సహాయపడుతుంది అందుచేతనే గాయాలు తగిలిన వెంటనే అవి త్వరగా మానుతాయి.
3). ఆముదం నూనెను ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణా లు ఉండడం వల్ల దీర్ఘకాలిక నొప్పులకు ఉపశమనం గా ఉపయోగ పడుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే సమయం ముందు ఈ నూనెతో మసాజ్ చేస్తే త్వరగా నొప్పులు తగ్గుతాయి.
4). కాళ్ళ మడమలు దగ్గర పగుళ్లు తగ్గించడానికి ఈ ఆముదం బాగా ఉపయోగ పడవచ్చు.. ఇందుకోసం పాదాలను శుభ్రంగా కడుక్కొని ఆమోదంతో చీలిన వాటిపైన మసాజ్ చేస్తే దీనివల్ల పగుళ్లు తగ్గిపోతాయి.
అందుచేతనే ఆముదం  మన శరీరానికి చాలా మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: