ఎక్కిళ్లను క్షణాల్లో తగ్గించే ట్రిక్స్!

Purushottham Vinay
ఎక్కిళ్ళు.. దాదాపు అందరూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో వీటిని ఎక్కువగా ఫేస్ చేసే ఉంటారు. కొందరిని  అయితే ఎక్కిళ్ళు అప్పుడప్పుడు ఇబ్బంది పెడితే.. కొందరిని మాత్రం తరచూ ఇవి వేధిస్తూనే ఉంటాయి.అయితే ఇది చాలా చిన్న సమస్యే అయినా కానీ చాలా తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది. పైగా ఎక్కిళ్ళు వస్తున్నంతసేపు కూడా సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు. చేస్తున్న పనిపై కూడా ఏకాగ్రత చూపలేకపోతుంటారు. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక, ఆ ఎక్కిళ్ళను ఎలా తగ్గించుకోవాలో అర్థంగాక చాలా ఆగమాగం అయిపోతుంటారు. అయితే అలాంటప్పుడు ఇప్పుడు చెప్పబోయే సూపర్ ఎఫెక్టివ్ టిప్స్‌ను కనుక పాటిస్తే చిటికెలో ఎక్కిళ్ళను చాలా ఈజీగా నివారించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఎక్కిళ్ళను తగ్గించే ఈ టిన్స్‌ ఏంటో మనం తెలుసుకుందాం చూడండి.ఇక ఎక్కిళ్ళను నిమ్మకాయ క్షణాల్లో తగ్గించగలదు. ఎక్కిళ్ళు బాగా వస్తున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసాన్ని డైరెక్ట్‌గానే తీసుకుంటే అవి చాలా త్వరగా ఆగిపోతాయి. నిమ్మ రసానికి బదులు ఆపిల్ సైడర్ వెనిగర్ ను కూడా ఇందుకు వినియోగించవచ్చు. ఎక్కిళ్ళను వేగంగా తగ్గించే సామర్థ్యం అనేది దానికి కూడా ఉంది. 


ఆపిల్ సైడర్ వెనిగర్ ను మూడు ఇంకా నాలుగు చుక్కల చప్పున నోట్లో వేసుకుంటే ఎక్కిళ్ళ నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.ఇక మళ్ళీ మళ్ళీ ఆగకుండా ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు.. గట్టిగా ఊపిరిని పీల్చి కొన్ని సెకెండ్ల పాటు అలాగే బిగబట్టాలి. ఇలా చేసినా ఎక్కిళ్ళు వెంటనే తగ్గు ముఖం పడతాయి.ఇంకా అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్‌ను తీసుకుని ఏదైనా పల్చటి వస్త్రంలో చుట్టి.. మెడపైన పెట్టుకోవాలి.ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఈ విధంగా చేస్తే వెంటనే ఉపశమనం పొందొచ్చు.అలాగే కోక పౌడర్‌తోనూ ఎక్కిళ్ళను చాలా ఈజీగా వదిలించుకోవచ్చు. ఆగకుండా ఎక్కిళ్ళు బాగా వస్తున్నప్పుడు కోక పౌడర్‌ను కొద్దిగా నోట్లో వేసుకుని తినాలి. ఇలా చేస్తే శ్వాస నాళానికి మంచి విశ్రాంతి అనేది లభిస్తుంది.దాని ఫలితంగా ఎక్కిళ్ళు సమస్యలు దూరం అవుతాయి. ఇక ఎక్కిళ్ళు బాగా వస్తున్న సమయంలో కొద్దిగా అల్లం రసం తీసుకున్నా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇక ఈసారి ఆగకుండా ఎక్కిళ్ళు వస్తే ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఈ ఎక్కిళ్ల సమస్యను చాలా ఈజీగా దూరం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: