శరీరానికి మంచి ప్రోటీన్స్ కోసం ఈ ఆహార పదార్ధాలు తీసుకోండి....

Purushottham Vinay
మన శరీరం బలంగా ఉండాలంటే మన బాడీకి ప్రోటీన్స్ చాలా అవసరం.ఈ పదార్ధాలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని మీ డైట్ లో అలవాటు చేసుకోండి...పొట్ట గొడుగులు మీరు ఉదయాన్నే అల్పాహారం లో లేదంటే రాత్రి డిన్నర్ కింద తీసుకోవచ్చు పుట్టగొడుగుల్లో కొద్దిగా సాల్ట్, బట్టర్ మరియు మిరియాల పొడి వేసి తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. లేదా కొద్దిగా తులసి ఆకులు కానీ ఏమైనా ఫ్రెష్ హెర్బ్స్ ని కానీ వాటిలో వేసి తీసుకుంటే కూడా మంచిది. దీని వలన మనకి ఏడు గ్రాముల ప్రోటీన్స్ మరియు 3.2 గ్రాముల కార్బోహైడ్రేట్స్ మనకి వస్తాయి.చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తాయి. శాఖాహారులు ప్రోటీన్స్ కోసం వీటిని తీసుకోవడం చాలా మంచిది. ప్రతి రోజు రెండు టేబుల్ స్పూన్స్ ఓట్స్ లో లేదా పుడ్డింగ్ లో వేసుకుని తీసుకోవడం వల్ల మీకు మంచి ప్రోటీన్ మరియు ఫైబర్ అందుతుంది. చియా సీడ్స్ వల్ల 7 గ్రాముల ప్రోటీన్స్ మరియు 12 గ్రాముల కార్బోహైడ్రేట్స్ మీకు అందుతుంది. కనుక శాకాహారులు దీనిని తీసుకోవడం వలన సూపర్ బెనిఫిట్స్ ని పొందవచ్చు.

30 గ్రాములు పిస్తా తీసుకోవడం వల్ల మీకు మంచి ప్రోటీన్స్ వస్తాయి. మీరు దీనిని స్నాక్స్ కింద కూడా తీసుకో వచ్చు. పిస్తా వల్ల మీకు ఎనిమిది గ్రాముల ప్రోటీన్ మరియు ఎనిమిది గ్రాముల కార్బోహైడ్రేట్స్ వస్తాయి. శాఖాహారులు కనుక ఈ ఐదు ఆహార పదార్ధాలని డైట్ లో చేర్చుకుంటే మంచి ప్రోటీన్స్ వస్తాయి.ఆల్మండ్ బటర్ వల్ల మంచి ప్రోటీన్స్ మీకు అందుతాయి. శాండ్విచ్ మీద రెండు టేబుల్ స్పూన్ ఆల్మండ్ బటర్ మీరు వేసుకుని తీసుకోవచ్చు. లేదంటే ఏదైనా స్మూతీ చేసి దాని మీద వేసుకుని తాగొచ్చు. దీని వల్ల 8 గ్రాముల ప్రోటీన్స్ మరియు ఒక గ్రాము కార్బోహైడ్రేట్స్ మీకు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: