గోల్డ్ ఇటిఎఫ్‌లో పెరిగిన పెట్టుబడులు, లాభాలు

Vimalatha
ఈ రోజు హైదరాబాద్ లో 22 క్యారెట్లు 44,180 / 10 గ్రాములు, 24 క్యారెట్లు 48,200 / 10 గ్రాములు, ఇక వెండి విషయానికొస్తే కేజీ వెండి ధర రూ.67,400 ఉంది.
సెప్టెంబర్ లో గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్) లో పెట్టుబడులు పెరిగాయి. రూ.446 కోట్ల పెట్టుబడి వచ్చింది. దేశంలో పండగల సీజన్ దృష్ట్యా పెరిగిన డిమాండ్ కారణంగా ఈ పెట్టుబడుల ప్రవాహం ప్రస్తుతానికి కొనసాగుతుందని భావిస్తున్నారు. గత నెలలో గోల్డ్ ఇటిఎఫ్‌లో రూ .24 కోట్ల నికర పెట్టుబడి వచ్చింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) డేటా ప్రకారం జూలైలో పెట్టుబడి దారులు గోల్డ్ ఈటీఎఫ్‌ల నుండి నికర రూ. 61.5 కోట్లు పొందారు.
గోల్డ్ ఇటిఎఫ్ కేటగిరీ లో ఇప్పటి వరకు రూ. 3,515 కోట్ల నికర పెట్టుబడి లభించింది. దాని నుండి రిటర్న్స్ తీసుకున్న ఏకైక నెల జూలై. తాజా పెట్టుబడులతో ఈ కేటగిరీలోని ఫోలియోల సంఖ్య ఆగస్టులో 21.46 లక్షల నుండి సెప్టెంబర్‌ లో 14 శాతం పెరిగి 24.6 లక్షలకు చేరుకుంది. ఫోలియోల సంఖ్య 56 శాతం ఈ ఏడాది ఇప్పటి వరకు పెరిగింది. పండగ సీజన్‌కు ముందు పసుపు లోహాల ధరలలో ‘దిద్దుబాటు’ వల్ల గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మార్కెట్లో అనిశ్చితి, పెట్టుబడి పెరుగుతోంది
LXME వ్యవస్థాపకుడు ప్రీతి రథి గుప్తా మాట్లాడుతూ “గత నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌లు చాలా మంచి పెట్టుబడులు చూశాయి. అస్థిర మార్కెట్‌ లోని పెట్టుబడి దారులకు దానిలో పెట్టుబడి పెట్టడం సురక్షితమైన ఎంపిక అని అర్థమైంది. దీని కారణంగా దానిలో పెట్టుబడి పెరిగింది. ఇది మాత్రమే కాకుండా బంగారం ధరల పెరుగుదల కారణంగా పెట్టుబడిదారులు కూడా దాని వైపు ఆకర్షితులవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: