ఆ విషయంలో శ్రీ లీల ఆవేదన..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటి ఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి శ్రీ లీల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా ఈమె మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన మాస్ జాతర అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయిన కూడా ఈ సినిమాలో శ్రీ లీల తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె తమిళ నటుడు శివ కార్తికేయన్ హీరో గా రూపొందుతున్న పరశక్తి అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.


ఈ సినిమా కనుక మంచి విజయం సాధిస్తే తమిళ సినీ పరిశ్రమలో కూడా శ్రీ లీల కి మంచి క్రేజ్ దక్కే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ లీల సోషల్ మీడియా వేదికగా ఒక విషయంలో తన ఆవేదనను వ్యక్తం చేసింది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా శ్రీ లీల తన సోషల్ మీడియా వేదికగా AI ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ గురించి తన ఆవేదన వ్యక్తం చేసింది. టెక్నాలజీ అనేది మనల్ని ముందుకు తీసుకు వెళ్లాలి , జనాల్ని ఆనందంగా బ్రతికేందుకు సహాయ పడాలి. కానీ అదే టెక్నాలజీ జనాలను మరింత భయపడాలా చేయవద్దు. AI టెక్నాలజీ వల్ల కొంత మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. AI టెక్నాలజీ వల్ల చెడు జరగకుండా చూడాలి. అందుకే టెక్నాలజీ ద్వారా మంచిని మాత్రమే ప్రోత్సహించి చెడుకు ఏ మాత్రం దారి లేకుండా చేయాలి అని శ్రీ లీల సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: