స్వల్పంగా పెరిగిన బంగారం, భారీగా తగ్గిన వెండి

Vimalatha
బంగారం ధర రోజురోజుకూ పెరిగిపోతూ పసిడి ప్రేమికులను నిరాశకు గురి చేస్తోంది. నిన్నటి మాదిరిగానే నేడు కూడా బంగారం ధర పెరిగింది. నేడు బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 110కి పెరిగాయి. పెరిగిన ధరలతో నేడు 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం రూ.4,490, 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 4,480గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800గా ఉంది. ప్రతిరోజూ పెరుగుతూ వస్తున్న బంగారం రూ.50 వేలకు దగ్గర కావడం సామాన్యులను ఆందోళన పరిచే విషయం. కాగా ఈరోజు దేశంలోని పలు ముఖ్యమై మెట్రోపాలిటన్ సిటీల్లో ధరలు ఇలా ఉన్నాయి.

 
హైదరాబాద్ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900, 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990,
బెంగుళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900, 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,900,
చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,310, 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,430,
ముంబై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,080, 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,080,
ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050, 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,250,
విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900, 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990,
విశాఖ పట్నం : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900, 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990గా ఉన్నాయి.
ఇక వెండి విషయాని కొస్తే నేడు వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కేజీ వెండి ధర రూ.5,200కు దిగి వచ్చింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి రూ.69,200గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: