స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. స్థిరంగా వెండి ధర .. !

Satvika
కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశంలో బంగారం ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి.. మార్కెట్ లో నిల్వలు ఎక్కువ అవడంతో పాటుగా బంగారానికి డిమాండ్ తగ్గడంతో పసిడి ధరలు కిందికి దిగి వస్తున్నాయి. ఈరోజు మార్కెట్ లో కూడా పసిడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. విదేశీ మార్కెట్ లో నిన్న ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు కిందకు దిగివచ్చాయి. మొత్తానికి బంగారం ధరలు కిందకు దిగిరావడం మహిళలకు ఎక్కడ లేని సంతోషాన్ని ఇస్తుంది.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారు దుకాణాల వద్ద మహిళలు బారులు తీరారు. హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళ వారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గింది.. రూ . 47,890 వద్ద కొనసాగుతుంది. ఇకపోతే 10 గ్రాముల 22 క్యారెట్లు బంగారం ధర కూడా అదే దారిలో నడిచింది. రూ . 43,900కు క్షీణించింది.
మార్కెట్ లో పసిడి ధరలు తగ్గితే.. వెండి ధరలు మాత్రం నిలకడగా కోనసాగుతున్నాయి.  కేజీ వెండి ధర రూ.73,100 వద్దనే కొనసాగుతోంది. వెండి కొనాలని భావించేవారికి ఇది సరైన సమయం అనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి.  పసిడి రేటు ఔన్స్‌కు 1784 డాలర్లకు ఎగసింది.వెండి 25.93 డాలర్ల వద్ద కొనసాగుతుంది. మరి రేపు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి ..

బంగారం గురించి మీకు తెలియని విషయాలు ఇవే..
మన దేశంలో బంగారం అనేది ఎప్పుడూ విలువైన వస్తువే.. దీంతో చోరీకి గురవ్వడం లేదా స్మగ్లింగ్ చేస్తున్నారు.. అది కూడా విదేశాలలోని బంగారం నిల్వలను ఇక్కడకు తీసుకురావడానికి  కొందరు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గల్ఫ్ దేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ బంగారం ధర తక్కువతో పాటుగా, నాణ్యత కూడా ఎక్కువే అందుకే మనదేశం విదేశీ బంగారాన్ని రోజు పోలీసులు పట్టుకుంటున్నారు. మనదేశం కూడా నాణ్యమైన బంగారం దొరితే ఇక విదేశాల నుంచి స్మగ్లింగ్ ఎందుకు జరుగుతుంది. ఇది గమనించాల్సిన విషయం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: