నేటి బంగారం, వెండి ధరలు ఇలా .. !!

Satvika
బంగారం కొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. నిన్నటి ధరలే నేడు మార్కెట్ లో కొనసాగుతున్నాయి. ఇది ఓ రకంగా ఊరట కలిగించే విషయం అనే చెప్పాలి. పసిడి రేటులో ఎలాంటి మార్పు లేదు. వెండి ధర మాత్రం పడిపోయింది. వెండి రేటు 3 రోజులుగా పడుతూనే వస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది.వెండి ధరలు కిందకు వస్తున్న నేపథ్యంలో ఆ వస్తువుల తయారీకి మళ్ళీ డిమాండ్ భారీగా పెరిగింది.

ఇకపోతే హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో రేటు రూ.49,750 వద్దనే ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.45,600 వద్ద స్థిరంగా ఉంది. బంగారం ధర బాటలో కాకుండా వెండి రేటు వేరే దారిలో పయనించింది. వెండి ధర రూ.500 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,400కు పడిపోయింది. వెండి రేటు 3 రోజుల్లోనే రూ.2,100 తగ్గింది.

వెండి నాణేలు, వస్తువుల తయారీ మందగించడం తో ఈరోజు ధరలు వెల వెల బోతున్నాయని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర నిలకడగానే ఉంది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1881 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి రేటు మాత్రం క్షీణించింది. 1.49 శాతం తగ్గుదలతో 27.65 డాలర్లకు దిగొచ్చింది.బంగారం ధరలు ఇలా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు పసిడి ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి రేపటి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: