స్థిరంగా బంగారం... పరుగు తీస్తున్న వెండి

Suma Kallamadi
దేశీయ మార్కెట్ లో బంగారం స్థిరంగా కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తుంది. కానీ వెండీ ధర మాత్రం దేశీ మార్కెట్ లో పరుగులు తీస్తోంది.హైదరాబాద్ మార్కెట్ లో కూడా బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. శనివారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.400కి తగ్గడంతో ధర రూ.54,460కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.390 తగ్గుదలతో రూ.50,840 కి చేరింది. గత కొద్ది రోజులుగా ధర తగ్గుతూ వస్తుంది.

దేశీయ మార్కెట్ లో పసిడి స్థిరంగా ఉన్నప్పటకీ వెండి ధర భారీగా పెరిగింది. మార్కెట్ కేజీ వెండి ధర ఏకంగా రూ.700  పెరగడంతో ధర రూ.67,100 కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం వల్ల ధరలు పెరగుదల, తగ్గుదలకు కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరియు అమెరికా-చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల వల్ల పసిడి స్థిరంగా ఉండటానికి దోహదపడుతున్నాయని, బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి ధర పెరుగుతోంది నిపుణులు పేర్కొంటున్నారు.

భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర స్థిరంగా నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గడంతో ధర రూ.55,600కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గడంతో రూ.51,000కు చేరింది. ఇక కేజీ వెండి ధర మాత్రం పరుగులు పెడుతోంది. 10 గ్రాముల వెండిధర రూ.671 పెరగడంతో రూ.67,100 కు చేరింది. విజయవాడ, విశాఖ పట్నంలో 24 క్యారెట్ల బంగారం రూ.55, 460, 22 క్యారెట్ల బంగారం రూ.50,840 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే ఔన్స్ వెండి 26.60 డాలర్లకు అటు ఇటుగా ఉంటోందని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: