పరుగులు తీస్తున్న పసిడి.. వెండి మాత్రం !

Suma Kallamadi

బంగారం ధర పైపైకి పరుగులు పెడుతూ రికార్డు స్థాయికి చేరింది. ధర అమాంతం ఆకాశాన్నంటుకుంది. ధరను చూస్తేనే కస్టమర్లు హడలెత్తిపోతారన్నట్లుగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారంతో పాటుగా వెండి కూడా దూసుకెళ్తుంది.

 

 

పసిడి ప్రేమికులకు చేదు వార్త. బంగారం ధర రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. దీంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పెరుగుతున్న నేపథ్యంలో భారత దేశంలో కూడా ధరలు పరుగులు తీశాయని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్ వెండి ధర పెరుగుతున్నా దేశీయ మార్కెట్ లో మాత్రం ధర తగ్గింది.

 

 

హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర పైపైకి ఎగబాకింది. శనివారం నాటికి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.720కి చేరింది. దీంతో బంగారం ధర రూ.53,220 కి పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.640 పెరగడంతో రూ.48,790కి పెరగడం గమనార్హం.

 

 

అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన వెండి ధర దేశీయ మార్కెట్ లో మాత్రం పడిపోయింది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.950 తగ్గడంతో ధర రూ.61,050కి దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం, ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ లో పసిడి ధరలో మార్ప, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.

 

 

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.550 పెరగగా ధర రూ.49,550కు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 పెరిగి ధర రూ.50,750 కి చేరింది. ఇక కేజీ వెండి ధర కూడా ఏకంగా రూ.950 తగ్గుదలతో రూ.61,050కి క్షిణించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: