బంగారం: భారీగా తగ్గిన బంగారం ధర.... ఎంత తగ్గిందంటే?
అవును బంగారం ధర భారీగా తగ్గింది. ఇటీవలే కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. సంవత్సరం క్రితం వరకు రూ.31 వెయ్యి ఉన్న బంగారం ధర ఇప్పుడు ఏకంగా 50 వేలకు చేరింది. కేవలం ఒక్క సంవత్సరంలో తులం బంగారంపై 19 వేల రూపాయిలు పెరిగింది అంటేనే అర్థం చేసుకోవాలి. బంగారం ధర ఎంత పెరిగింది అనేది.
రోజు రోజుకు భారీగా పెరుగుతున్న బంగారం ఈరోజు తగ్గింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగినప్పటికీ జువెలర్లు, రిటైర్ల నుంచి డిమాండ్ మందగించడంతో ధరపై ప్రతికూల ప్రభావం పడిందని అందుకే బంగారం ధర తగ్గిందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయ్ అనేది ఇప్పుడు చూద్దాం.
నేడు మంగళవారం హైదరాబాద్ లో మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.90 తగ్గుదలతో రూ.51,240కు చేరింది. ఇంకా అదే సమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.90 తగ్గుదలతో రూ.46,950కు చేరింది. బంగారం భారీగా తగ్గగా వెండి ధర మాత్రం భారీగా పెరిగింది . దీంతో కేజీ వెండి ధర 240 రూపాయిల పెరుగుదలతో రూ.53,150లకు చేరింది.
కాగా దేశ రాజధాని ఢిల్లీలోను నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయిల తగ్గుదలతో రూ.49,050కు చేరగా, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 60 రూపాయిల తగ్గుదలతో రూ.47,850లకు చేరింది. ఇంకా వెండి ధర 240 రూపాయిల పెరుగుదలతో రూ.53,150కు చేరింది. ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.