బంగారం: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర!

Durga Writes

పసిడి ధరలు ఎంత తగ్గాయో తెలుసా? మొన్నటికి మొన్న భారీగా తగ్గిన ఈ పసిడి ధర నిన్నటికి నిన్న దారుణంగా పెరిగింది. ఇంకా అలాంటి బంగారం ధర నేడు భారీగా తగ్గింది. అయితే గత మూడు నెలల్లో దాదాపు 7 వేల రూపాయలకుపేగా బంగారం ధర పెరిగింది. అయితే దీనికి కరోనా వైరస్. ఈ వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు దారుణంగా కుప్పకూలాయి. దీంతో ఇన్వెస్టర్లు అందరూ కూడా బంగారం ధరపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే బంగారం ధరలు భారీగా పెరిగాయి. 

 

 

అయితే ఈరోజు మాత్రం బంగారం ధరలు బారీగా తగ్గాయి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయిల తగ్గుదలతో 49,610 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 60 రూపాయిల తగ్గుదలతో 45,470 రూపాయలకు చేరింది.  

 

 

ఇంకా వెండి ధర కూడా భారీగా తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర 100 రూపాయిల తగ్గుదలతో 47,600 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 49 వేలు కొనసాగుతుండగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతుంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: