బంగారం : వామ్మో బంగారం.. వరుసగా మూడో రోజు కూడా?

Durga Writes

బంగారం ధరలు ఎలా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకు ఈ బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. ఎప్పుడు తగ్గుతాయో తెలియదు కానీ గత మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్నాయ్, నిజానికి మూడు రోజుల కిర్తం బంగారం ధరలు తగ్గాయి.. 

 

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2 వేలు తగ్గాయి.. అయితే ఎం లాభం.. ఈ మూడు రోజుల్లో మళ్లీ పెరిగాయ్ కదా! మొన్న 610 రూపాయిలు పెరిగింది.. నిన్న 650 రూపాయిలు పెరిగింది.. ఈరోజు ఏకంగా 810 రూపాయిలు పెరిగింది.. సరిపోయింది కదా! రేపు కూడా పెరుగుతుంది.. అయితే ఇంత కాదు ఓ రెండు వందలు పెరుగుతుంది. ఇది అండి పరిస్థితి.. బంగారం ధరలు రోజు రోజుకు ఇలా పెరుగుతున్నాయి.. 

 

ఇంకా ఇదే నేపథ్యంలో బంగారం ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 510 రూపాయిల పెరుగుదలతో 45,810 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 840 రూపాయిల పెరుగుదలతో 42,500 రూపాయలకు చేరింది.  

 

అయితే ఈరోజు కేవలం బంగారం ధరలు మాత్రమే పెరగలేదు... వెండి ధరలు కూడా అలానే భారీగా పెరిగాయి. దీంతో నేడు కేజీ వెండి ధర 110 రూపాయిల పెరుగుదలతో 42,530 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.                                       

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: