బంగారం: ఈరోజు బంగారం కొనాలనుకునేవారికి సూపర్ షాక్?

Durga Writes

వారం రోజుల తగ్గుదలకు నేడు బ్రేకులు పడ్డాయి.. బంగారం సామాన్యుడికి బహుదూరమైంది. బంగారం కోనివ్వు అంటే.. లక్ష అయినా ఇస్తా కానీ బంగారం అడగకే సరోజా అని అనే రోజులు వచ్చేసాయి. బంగారం ధర ఇప్పు 40 వేలు.. కానీ మనం అది కొనడానికి వెళ్తే 50 వేలు.. ఎందుకు ఏమి అని అడిగితే.. ఆ షాపు వాళ్ళు చెప్పే మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే.. ఆలా ఉంటాయి వాళ్ళ మాటలు. 

 

షాపు వాళ్ళు ఏమి చెప్తారు అంటే.. మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి.. ఆ ఛార్జెస్ ఉంటాయి అని చెప్పి 10వేలు ఎక్సట్రా తీసేసుకుంటారు. అది వారి కూలి.. కానీ ఇక్కడ కొనేవారికి మాత్రం గుండెపోటు.. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 50 రూపాయిల పెరుగుదలతో 41,050 రూపాయలకు చేరింది. 

 

అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 70 రూపాయిల పెరుగుదలతో 38,090 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా అదే భాటలోనే పరుగులు పెట్టింది. దీంతో నేడు కేజీ వెండి ధర 100 రూపాయిలు పెరుగుదలతో 49,400 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా పెరగటంతో బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

 

కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. సామాన్యులకు అందనంత దూరంలో బంగారం ధరలు చేరాయి. తగ్గినట్టు తగ్గి మళ్ళి షాక్ ఇస్తున్నాయి ఈ బంగారం ధరలు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: