గుడ్ న్యూస్.. ఇండియన్ నేవీలో ఉద్యోగాలు ?
చాలా మందికి కూడా దేశానికి సేవ చెయ్యాలనే కల ఉంటుంది. అందుకే వారు చిన్నప్పటి నుంచి ఆర్మీలోకి వెళ్లాలని కోరుకుంటారు. ముఖ్యంగా నేవిలోకి వెళ్లాలని అందులో పని చేసి దేశానికి సేవ చెయ్యాలనుకునేవారికి గుడ్ న్యూస్.ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ).. ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమి(ఐఎన్‌ఏ) జూన్ 2023లో ప్రారంభమయ్యే కోర్సులో ఎంపికైన అభ్యర్థులు సంబంధిత శాఖలు/కేడర్ /స్పెషలైజేషన్లలో శిక్షణ పొందుతారు. డిగ్రీ, పీజీలో సాధించిన మార్కుల ఆధారంగా నౌకాదళంలో ప్రవేశాలుంటాయి. అభ్యర్థులకు సబ్ లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ ఉంటుంది.మొత్తం పోస్టుల సంఖ్య విషయానికి వస్తే 217 వున్నాయి.
ఇంకా అలాగే బ్రాంచి/కేడర్ వివరాల విషయానికి వస్తే..
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ : జనరల్ సర్వీస్/హైడ్రో కేడర్-56, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్-05, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్-15, పైలట్-25, లాజిస్టిక్స్-20;
ఎడ్యుకేషన్ బ్రాంచ్: ఎడ్యుకేషన్-12;
టెక్నికల్ బ్రాంచ్: ఇంజనీరింగ్ బ్రాంచ్(జనరల్ సర్వీస్)-25, ఎలక్ట్రికల్ బ్రాంచ్(జనరల్ సర్వీస్)-45, నావల్ కన్‌స్ట్రక్టర్-14.
అర్హత విషయానికి వస్తే..పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో బీటెక్, బీఈ, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ(ఐటీ), పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ(ఐటీ), కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణతతోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.ఈ పోస్టులకు ప్రారంభవేతనం విషయానికి వస్తే..నెలకు రూ.56,100తో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.ఇంకా అలాగే ఎంపిక విధానం విషయానికి వస్తే..డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, మెడికల్ స్టాండ ర్డ్స్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.ఈ పోస్టులకు దరఖాస్తు విధానం ఆన్‌లైన్ ద్వారా ఉంటుంది.ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది వచ్చేసి 06.11.2022. కాబట్టి ఖచ్చితంగా ఆసక్తి ఇంకా అర్హత వున్న అభ్యర్థులు అప్లై చేసుకోండి. ఆసక్తి గల అభ్యర్థులు వెబ్‌సైట్ https://www.joinindiannavy.gov.in/ ని సందర్శించండి.