తెలంగాణాలో స్కూల్ సెలవులు పొడిగింపు... కారణం ఇదే?

VAMSI
గత మూడు సంవత్సరాలకు ముందు చైనా దేశంలోని వుహాన్ నగరం నుంచి ఊడి పడిన వైరస్ కరోనా. దీని వలన ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారు కోట్ల లోనే ఉన్నారని చెప్పాలి. అయితే అప్పటి నుండి ఈ వైరస్ దశల వారీగా వస్తూ ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోంది. వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం ఇప్పటి వరకు చూసుకుంటే మూడు వేవ్ లు వచ్చి వెళ్లాయి. ఇప్పుడు నాలుగవ వేవ్ కూడా రావడానికి సిద్ధంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గత కొద్ది రోజులుగా దేశంలోని కొన్ని రాష్ట్రాలలో కేసులు రావడం మనము గమనించినదే. అయితే అవి కాస్తా రోజు రోజుకి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వాలు త్వరిత గతిన దీనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే రోజు రోజుకీ కేసుల బెడద ఎక్కువ అవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం నుండి ప్రజలకు తగిన సూచనలు అందాయి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్క్ ను ధరించాలని తెలిపారు. ఒకవేళ మాస్క్ ను ధరించకపోతే తగిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని చెప్పారు. కాగా ఇప్పుడు ఈ కరోనా ప్రభావము పాఠశాలలపై పడినట్లు తెలుస్తోంది. మాములుగా అయితే అధికారిక సమాచారం ప్రకారం సోమవారం నుండి అన్ని స్కూల్స్ ఓపెన్ కావాల్సి ఉంది.
కానీ పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని సోమవారం స్కూల్స్ ను తెరవాలా ? వద్దా ? అన్న సందిగ్ధంలో పడింది. దీనిపై పూర్తి వివరాలు రేపు సాయంత్రం లోపు వెలువడే అవకాశం ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఒకవేళ స్కూల్స్ ఓపెన్ చేయకపోతే మళ్ళీ ఎన్ని రోజులకు ఓపెన్ చేస్తారు అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఈ కరోనా సమస్యాత్మకంగా మారకూడదని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: