TCS లో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్, పూర్తి వివరాలు!

Purushottham Vinay

ఇండియాలోనే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ tcs లో జాబ్ చెయ్యాలని ప్రతి ఒక్కరూ కూడా కలలు కంటుంటారు. ఎందుకంటే దీంట్లో ఉద్యోగం రావడం పెద్ద గవర్నమెంట్ ఉద్యోగంతో సమానం. ఇందులో ఉద్యోగులకు ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి.అలాగే మంచి జీతాలు కూడా ఉంటాయి.అట్లాస్ హైరింగ్ ప్రోగ్రామ్ ద్వారా అభ్యర్థులను రిక్రూట్ చేసుకోవడానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇంకా అలాగే దీని కోసం రిజిస్ట్రేషన్ బుధవారం నాడు స్టార్ట్ అయ్యింది.ఇక ఈ IT కంపెనీ 2020, 2021 ఇంకా అలాగే 2022లో M.Scతో ఉత్తీర్ణులైన ఫ్రెషర్లను రిక్రూట్ చేస్తోంది లేదా M.A డిగ్రీ అయినా కలిగి ఉండాలి.ఇక పరీక్ష  అలాగే ఇంటర్వ్యూ తేదీలు అనేవి ఇంకా ప్రకటించబడలేదు. ఇక కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఆవిష్కరణల పట్ల మక్కువతో ఆకట్టుకునే ప్రతిభావంతులకు ప్రత్యేకంగా అవకాశాలను అందించేలా ప్రోగ్రామ్ ప్రత్యేకంగా రూపొందించబడింది.కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హత కలిగిన విద్యార్థులు వెంటనే తప్పనిసరిగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఇక ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలి?

 దశ 1. tcs అధికారిక పోర్టల్‌ ని ఓపెన్ చెయ్యండి. సిస్టమ్ లో https://nextstep.tcs.com/campus/#/ వెబ్ సైట్ ని ఓపెన్ చెయ్యండి.

దశ 2. అవసరమైన సమాచారాన్ని అందించండి. తరువాత ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి.

దశ 3. రిజిస్ట్రేషన్ తర్వాత, మీ రిఫరెన్స్ ID ఇంకా అలాగే పాస్‌వర్డ్ ని క్రియేట్ చేసుకోని వాటిని ఉపయోగించి లాగిన్ అవ్వండి.

దశ 4. ఇక చూపించబడ్డ దరఖాస్తు ఫారమ్‌ను కంప్లీట్ చెయ్యండి. ఆ తరువాత భవిష్యత్తు సూచన కోసం అప్లికేషన్ నంబర్‌ను సేవ్ చేయండి.

దశ 5. tcs అట్లాస్ హైరింగ్  అధికారిక పేజీని ఓపెన్ చెయ్యండి.

దశ 6. మీ రిఫరెన్స్ IDని నమోదు చేయండి. ఇంకా అలాగే అవసరమైన ఆధారాలను పూరించండి.

దశ 7. మీరు tcs అట్లాస్ హైరింగ్ పేజీలో మీ వివరాలను అందించిన తర్వాత మాత్రమే మీ దరఖాస్తు పూర్తవుతుంది.

కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హత కలిగిన విద్యార్థులు వెంటనే తప్పనిసరిగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: