ఇవాళ్టి నుంచి తెలంగాణలో అన్ని స్కూళ్లు ఓపెన్..?

తెలంగాణలో ఇప్పుడు అన్ని స్కూళ్లు ప్రారంభం కాబోతున్నాయి. అదేంటి.. తెలంగాణలో స్కూళ్లు మొదలై చాలా రోజులు అవుతోంది కదా అంటారా.. కానీ.. రెసిడెన్షియల్‌ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్భా స్కూళ్లు అన్నీ ప్రారంభం కాలేదు. కొంతమంది కోర్టుకు వెళ్లడమే ఇందుకు కారణంగా. తెలంగాణ హైకోర్టు తీర్పు కారణంగా.. రెసిడెన్షియల్‌ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్భా స్కూళ్లు ఈ ఏడాది ప్రారంభం కాలేదు.

అయితే.. ఈ అంశంపై విచారణ తర్వాత హైకోర్టు గురుకులాలకు పచ్చజెండా ఊపింది. వీటితో పాటు మోడల్ స్కూళ్లు, కస్తూర్భా స్కూళ్లు అన్నింటికి ఓకే చెప్పింది. అందుకే ఇప్పుడు ఆయా గురుకుల సొసైటీలు సమావేశమై ఇవాళ్టి నుంచి పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు విద్యాశాఖ కార్యదర్శి, విద్యాశాఖ సంచాలకులు, అన్ని గురుకులాల కార్యదర్శిలతో సమావేశం నిర్వహించామని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు.

కోర్టు ఆదేశాల మేరకు నేటి నుంచి అన్ని గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, బాలికల హాస్టళ్లు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలలు ప్రారంభించాలని నిర్ణయించామని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరించారు. అయితే.. అన్ని గురుకల పాఠశాలలను, వసతి గృహాలను, భోజనాల గదులు సానిటైజేషన్ చేయాలని నిబంధనలు పెట్టారు. అంతే కాదు.. గురుకులాలలో సామాజిక దూరం పాటించాలని.. అందరూ విధిగా మాస్క్ లు ధరించాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు.
 
విద్యార్థుల్లో దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని.. ఉపాధ్యాయులు, అధ్యాపకులు విధిగా కోవిడ్ టీకాలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. ఇటీవల బీఎస్పీ నేత ప్రవీణ్‌ కుమార్ కూడా ఈ అంశాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించారు. ఆయన విమర్శించిన కొన్ని రోజులకే గురుకులాలు తెరచుకోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: