తెలంగాణ సర్కార్ తీపి కబురు.. ఉద్యోగులకు మంచి బెనిఫిట్..!!

Satvika
తెలంగాణ సర్కార్ ఎప్పటికప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కీలక నిర్ణయాల ను తీసుకుంటూ వస్తుంది. అందులో భాగంగా నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి అవకాశాలను ఇస్తూ వస్తుంది. నిరుద్యోగ సమస్యను కొంతవరకు తగ్గించేందుకు కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తుంది. అంతేకాదు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది.

పీఆర్సీ పై రెండు, మూడు రోజుల్లో శాసనసభలోనే ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులకు ఈ విషయం పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 29 శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తారన్న ఊహాగానాలు సైతం జోరుగా సాగుతున్నాయి. అయితే.. ఆర్థిక శాఖకు చేసిన కేటాయింపుల్లో రూ. 8 వేల కోట్లను ప్రత్యేకంగా చూపారు. అయితే ఈ బడ్జెట్ ను పీఆర్సీ కోసమే ప్రత్యేకంగా చూపారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఆర్థిక, ప్రణాళిక శాఖ కు బడ్జెట్లో రూ. 45,923 కోట్ల ను నిర్దేశించారు. అయితే రూ. 8 వేల కోట్లను మాత్రం నిర్వహణ పద్దు కింద చూపారు.

ఉద్యోగుల వేతన సవరణ అంశంపై బడ్జెట్లో ప్రభుత్వం ఎక్కడ ప్రస్తావించలేదు. ఉద్యోగులు పదవీ విరణమ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచితే మరో రూ.3 వేల కోట్ల వరకు ఆయా ఉద్యోగులకు అందించే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించడం వాయిదా పడుతుంది. ఆ మొత్తాన్ని పీఆర్సీ కోసం వినియోగించే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణ బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల గురించి కేసీఆర్ సర్కారు ప్రత్యేకంగా ప్రస్తావించింది. బడ్జెట్లో 122వ అంశంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను పొందుపరిచారు. గల్ఫ్ కు వెళ్లిన తెలంగాణ వాసులను ఆదుకోవాల్సిన భాద్యత సర్కార్ పై ఉందని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయడానికి ప్రత్యేక బృందం పర్యటించి వచ్చిందని వాళ్ళు ఇచ్చే నివేదిక ఆధారంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని బడ్జెట్లో పొందుపరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: