ఈసీఐఎల్‌లో ఉద్యోగ అవకాశాలు... పూర్తి వివరాలు ఇవే..

Satvika
తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు. నిరుద్యోగ యువత పాలిట తెలంగాణ సర్కార్ వరాల జల్లు కురిపిస్తున్నారు.. ఇప్పటికే పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇప్పుడు మరో నోటిఫికేషన్ విడుదల చేసారు.. హైదరాబాద్ ‌లోని ఈసీఐఎల్‌ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నోటిఫికేషన్ వివరాల తో పాటు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి...

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 9 ఖాళీలున్నాయి. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ యూనిట్‌లో ఈ ఖాళీలున్నాయి.. ఇవి కేవలం క్రాంట్రాక్ట్ జాబ్స్ మాత్రమే అని  నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు పూర్తి గా చదివి చేయడం మంచిది..

విద్యార్హతల వివరాలు చూస్తే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెక్నికల్ ఆఫీసర్ పోస్టు కు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి.అభ్యర్థుల వయస్సు టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు 30 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుకు 25 ఏళ్లు ఉండాలి. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు రూ.23,000, సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టు కు రూ.20,200 వేతనం లభిస్తుంది.. https://www.ecil.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.కెరియర్ సెక్షన్‌లో ఈ రిక్వైర్మెంట్ ఓపెన్ చేయాలి.అందులో నోటిఫికేషన్ సెలెక్ట్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఉద్యోగాలు సంబంధించి ఆఫ్షన్స్ ఉంటాయి వాటిపై  అప్లై చేసుకోవాలి.. అప్లై చేసుకోవాలి.. విద్యార్థులు, నిరుద్యోగులు ఈ జాబ్స్ కు సంబందించిన నోటిఫికేషన్ ను చదివి చేసుకోవాలి.. ఈ ఉద్యోగాల వల్ల కొంత వరకైనా నిరుద్యోగ సమస్య తీరుతుందని తెలంగాణ సర్కార్ భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: