జూలై 28వ తేదీకి  చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం...ఎందుకో తెలుసా..?

Spyder

గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూలై 28వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం..


ముఖ్య సంఘటనలు

1979: భారతదేశ 6వ ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశాడు.
2007: ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్ర ప్రదేశ్‌ వ్యాప్త బందులో ఖమ్మం జిల్లా ముదిగొండలో పోలీసు కాల్పులు జరిగి ఏడుగురు మరణించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

 

జననాలు

 

1909: కాసు బ్రహ్మానందరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1994)
1956: దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల నటుడు, అధ్యాపకుడు.
1962: కృష్ణవంశీ, తెలుగు సినిమా దర్శకుడు.


మరణాలు


1972: చారు మజుందార్, నక్సల్బరీ ఉద్యమ నేత. (జ.1918)
1976: తరిమెల నాగిరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు. (జ.1917)
1976: శ్రీనివాస చక్రవర్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకుడు, నాటక విద్యాలయ ప్రధానాచార్యుడు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకుడు. (జ.1911)
2004: ఫ్రాన్సిస్ క్రిక్, డీ.ఎన్.ఏ స్వరూపాన్ని కనుగొన్న సహశాస్త్రవేత్త. (జ.1916).
2009: లీలా నాయుడు, నటీమణి, ప్రపంచ సుందరి. (జ.1940). లీలా నాయుడు తెలుగు మూలాలు ఉన్న భార‌తీయ న‌టి. ఆమె మదనపల్లె (చిత్తూరు) నకు చెందిన ప్ర‌ముఖ‌ భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామయ్య నాయుడు కుమార్తె. రామయ్య పారిస్ లోని యూనెస్కో శాస్త్ర సలహాదారుగా పనిచేస్తున‌న స‌మ‌యంలో ఫ్రెంచ్ దేశానికి చెందిన‌ మార్తాను ఆయ‌న‌ వివాహం చేసుకున్నారు.  లీలానాయుడు 1960లో విడుదలైన "అనూరాధ తో చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఈ సినిమాకు హృషికేశ్ ముఖర్జీ దర్శకుడు, బలరాజ్ సాహ్ని కథానాయకుడు. ఈ సినిమాలో ఉత్త‌మ న‌ట‌న క‌న‌బ‌ర్చిన ఆమెకు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రముగా పురస్కారం పొందింది. 1962లో "ఉమ్మీద్" (అశోక్ కుమార్), పిమ్మట మర్చంట్-ఐవరీ వారి  థౌజండ్ హౌస్ హోల్డ‌ర్‌ (1963), శ్యామ్ బెనెగల్ "త్రికాల్" (1985) లలో నటించింది. లీలానాయుడు చేసింది కొద్ది సినిమాలే అయినా బాలీవుడ్ చిత్ర‌సీమ‌పై చెర‌గ‌ని ముద్ర వేసింద‌నే చెప్పాలి. 
2016: మహా శ్వేతాదేవి, నవలా రచయిత, సామాజిక కార్యకర్త. (జ.1926)
2019: సూదిని జైపాల్ రెడ్డి రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1942)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: