హైదరాబాద్‌కు మరో మెగా అట్రాక్షన్.. త్వరలో వంతారా జూపార్క్?

హైదరాబాద్‌కు త్వరలో ప్రపంచస్థాయి వన్యప్రాణి ఆకర్షణ రానుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అద్భుతంగా నిర్మాణంలో ఉన్న వంతారా రకాన్నే తెలంగాణలోని ఫ్యూచర్ సిటీ పరిధిలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదిరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నేతృత్వంలోని వంతారా బృందం ఈ మెగా జూపార్క్‌ను అభివృద్ధి చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

వంతారా అనేది సాధారణ జూపార్క్ కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణి పునరావాస, సంరక్షణ, పరిశోధన కేంద్రంగా రూపొందుతోంది. గుజరాత్‌లో మూడు వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు పులులు, సింహాలు, ఏనుగులు, జిరాఫీలతో పాటు అరుదైన జాతులకు సహజ నివాసం కల్పిస్తోంది. ఇప్పుడు అదే తరహాలో హైదరాబాద్ శివార్లలో రానున్న ఈ కొత్త వంతారా నగరవాసులకు అద్భుత అనుభవం అందించనుంది.

రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపు నుంచి అన్ని అనుమతుల వరకు పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.వన్యప్రాణులకు సేవ అనే నినాదంతో పనిచేస్తున్న వంతారా బృందాన్ని రేవంత్ రెడ్డి హృదయపూర్వకంగా అభినందించారు. ఈ నెల చివర్లో తాను గుజరాత్‌లోని వంతారాను స్వయంగా సందర్శించి, అకు వెళ్తానని ప్రకటించారు. ఆ సందర్శన అనంత్ అంబానీతో కలిసి జరగనుందని, అక్కడి అనుభవాలను హైదరాబాద్ ప్రాజెక్టుకు అన్వయించుకుంటామని తెలిపారు.

ఈ ప్రాజెక్టు పర్యాటకం, పర్యావరణ అవగాహన, విద్యా కార్యక్రమాలకు కొత్త దిశను ఇవ్వనుంది.ఈ ఒప్పందంతో హైదరాబాద్ మరో ప్రపంచస్థాయి ఆకర్షణను సొంతం చేసుకోబోతోంది. రాబోయే రెండేళ్లలో పనులు పూర్తయితే దేశంలోనే రెండో వంతారాగా ఫ్యూచర్ సిటీలోని ఈ కేంద్రం ఆవిర్భవించనుంది. పర్యాటక రంగంలో ఇప్పటికే ముందుంటున్న తెలంగాణకు ఈ మరింత గుర్తింపు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: