టాలీవుడ్‌లో ఆ న‌లుగురు లీల‌లు: పుచ్చుకునేది రు. 4 ల‌క్ష‌లు.. ఇచ్చేది ల‌క్ష ..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తాజాగా టాలీవుడ్లో తెరమీదకు వచ్చిన థియేటర్లో బంద్‌ వ్యవహారంతో ఆ నలుగురు లీలలు మరోసారి బయటకు వస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న థియేటర్లలో దాదాపు 60 నుంచి 70 % వరకు థియేటర్లను ఆ నలుగురు కబ్జార్ చేసేసారని..  రకరకాలుగా ఆ థియేటర్ల సొంత యజమానుల మీద ఒత్తిడి తీసుకువచ్చి గ్రౌండ్, లీజ్ లేదా థియేటర్ లీజ్‌ ఇలా రకరకాల పద్ధతులలో ఆ థియేటర్లలో తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ , ఎగ్జిబిటర్ అయిన నట్టి కుమార్ ఆ నలుగురు మీద తీవ్రమైన విమర్శలు చేశారు. నిజమైన థియేటర్ యజమానులు దగ్గర థియేటర్లను అద్దెకి తీసుకుంటున్న ఆ నలుగురు టాలీవుడ్ బడా బాబులు వారికి నెలకు కేవలం లక్ష రూపాయల మాత్రమే ఇస్తున్నారని .. వారు నిర్మాతల దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.


ఈ బంద్ వ‌ల్ల నిజ‌మైన ఎగ్జిబిట‌ర్ల‌కు ఒరిగేదేం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అలా నిజమైన ఎగ్జిబిటర్లను థియేటర్లో యజమానులను వారు మోసం చేస్తున్నారని ... ఒకవేళ ఎవరైనా సొంతంగా థియేటర్ నడిపించుకోవాలని అనుకుంటే వాళ్లకు సినిమాలు ఇవ్వకుండా నానా రకాలుగా తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసి ఆ ధియేటర్ ను ఏదోలా తమ చెప్పు చేతల్లోకి తీసుకుంటున్నారు అంటూ నట్టి కుమార్ ఆరోపించారు. ఇక ప్రస్తుతం తెరమీదకు వచ్చిన బంద్‌ కూడా ఎగ్జిబిటర్లకు తెలియకుండా ఆ నలుగురు ఫిలిం ఛాంబర్ లో కూర్చుని నిర్ణయం తీసుకున్నారు అని టాలీవుడ్ లో ఎప్పటికీ అయినా వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అంటూ నట్టి కుమార్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: