
ఉక్రెయిన్ కి మరో షాక్ ఇచ్చిన ట్రంప్..? పాపం జెలెన్ స్కి పరిస్థితి ఏంటో..!
ఉక్రెయిన్ రష్యా యుద్ధం మూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. యుద్ధాన్ని ఎగదోసి ఉక్రెయిన్ నష్టపోవడానికి ప్రత్యక్ష కారణం అమెరికానే అనే విషయం మనకి తెలిసిందే. జో బైడెన్ అధికారంలో ఉన్నంత వరకు ఉక్రెయిన్ కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆది నుంచి ఉక్రెయిన్ కు అమెరికా సాయం చేయడం ట్రంప్ కి ఇష్టం లేదు. ఈ క్రమంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ ఉక్రెయిన్ కు వరుస షాక్ లు ఇస్తూ వస్తున్నాడు.
తాజాగా ఉక్రెయిన్ కు మద్దతు తెలుపుతూ ఐక్యరాజ్య సమితి మందుకొచ్చిన ఓ తీర్మానాన్ని అమెరికా తోసిపుచ్చింది. రష్యాకు అనుకూలంగా ఓటు వేసి ఉక్రెయిన్‌కు ఊహించని షాకిచ్చింది. శాంతిస్థాపన కోసం ఉక్రెయిన్, ఇతర ఐరోపా దేశాలు ఐక్యరాజ్య సమితిలో సోమవారం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానికి అనుకూలంగా 93 సభ్య దేశాలు ఓటు వేయగా 18 దేశాలు ప్రతికూల ఓటు వేశాయి. మరో 65 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
యుద్ధ విరమణ, ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలంటూ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అమెరికా వ్యతిరేకంగా ఓటు వేసింది. తీర్మానంలోని భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యుద్ధానికి రష్యా కారణమని తీర్మానంలో పేర్కొనడాన్ని వ్యతిరేకించింది. ఈసారి తీర్మానంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన వారి సంఖ్య తగ్గడం గమనార్హం.
ఈ తీర్మానికి పోటీగా అమెరికా కూడా ఐక్యరాజ్య సమితిలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలంటూ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో రష్యా ప్రస్తావనే లేకపోవడంతో యూఎన్ సభ్య దేశాల మద్దతు లభించలేదు. అనంతరం ఈ తీర్మానికి భారీ మార్పులు చేసి కొత్త తీర్మానాన్ని యూఎన్ సభ్య దేశాలు ఆమోదింపజేసుకున్నాయి. దీనికి అనుకూలంగా 93 మంది ఓటు వేయగా 73 దేశాలు వ్యతిరేక ఓటు వేశాయి. మరో 8 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
అమెరికా తొలుత ప్రతిపాదించిన తీర్మానానికి రష్యా మద్దతుగా నిలిచింది. సరైన దిశలో తొలి అడుగుగా అమెరికా తీర్మానాన్ని అభివర్ణించింది.