ఒకేసారి జనంలోకి వస్తున్న కేసీఆర్, జగన్ లు.. ! ట్విస్ట్ మామూలుగా లేదు గా..?

frame ఒకేసారి జనంలోకి వస్తున్న కేసీఆర్, జగన్ లు.. ! ట్విస్ట్ మామూలుగా లేదు గా..?

ఏపీలో జగన్ బయటకు వచ్చారు. మిర్చి రైతుల పరామర్శ ద్వారా ఎన్నికల్లో ఓటమి తరువాత తొలి పర్యటన చేశారు.  ప్రతిపక్షంలో ఉన్న ఏకైక పార్టీ నేతగా తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంగా అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు.  ఈ సారి బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదు.


ఇక కేసీఆర్ కు హోదా ఉన్నా.. అసెంబ్లీకి వెళ్లటం లేదు. ఉగాది నుంచి జగన్ పార్టీ కేడర్ - ప్రజలతో మమేకం అయ్యేలా కొత్త కార్యాచరణ ఖరారు చేస్తున్నారు.  అనంతపురం నుంచి జిల్లాల పర్యటనలను ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వం ఈ నెల 28న ప్రవేశ పెట్టే బడ్జెట్ ఏపీ రాజకీయాల్లో కీలకం కానుంది.



కేసీఆర్ - జగన్ ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో బయటకు వచ్చారు. 2023 ఎన్నికల్లో ఓటమి తరువాత కేసీఆర్ ఫాం హౌస్ లోనే ఉంటున్నారు.  ఏడు నెలల తరువాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు.  కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వ్యాఖ్యలు చేసారు. తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు.  తాను అంతా గంభీరంగా చూస్తున్నానంటూ పార్టీ నేతలకు చెప్పుకొచ్చారు.  ఇక జనంలోకి వెల్లేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ద్వారా తన కార్యాచరణ ప్రకటించనున్నారు.


ఇక జగన్ సైతం చాలా యాక్టివ్ అవుతున్నారు. పార్టీ నుంచి  పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో కొత్త నియామకాలపై దృష్టి సారించారు జగన్. పార్టీ నేతలపై దాడులతో పాటు కేసులపై ప్రశ్నిస్తున్నారు. ఉగాది నుంచి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారం తిరిగి చేపడుతుందని ఘంటాపథంగా చెబుతున్నారు.


ఇక ఎన్నికల్లో ఓటమి తరువాత కేసీఆర్ ఫాం హౌస్.. జగన్ బెంగళూరు కు పరిమితం అయ్యారు. ఇప్పుడు ఇద్దరూ తిరిగి యాక్టివ్ అయ్యారు. ఒకే స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. టార్గెట్ ఫిక్స్ అయింది.  ఈ ఇద్దరి కొత్త వ్యూహాలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: