ఆ టీడీపీ ఎమ్మెల్యేపై కమ్మ, కాపు నేతలు చిత్తయ్యారు ... రెడ్డిని దింపిన జగన్...!
ఆయన వల్ల కూడా పరుచూరులో పార్టీ బలపడదని డిసైడ్ అయ్యి.. ఆయనను తప్పించి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు కొన్ని రోజులు ఇన్చార్జి ఇచ్చారు. ఆయన కూడా ఎన్నికలకు ముందు వెళ్లిపోవడంతో చీరాలలో గతంలో వైసిపి నుంచి పోటీచేసి ఓడిపోయిన ఎడం బాలాజీకి ఇన్చార్జి ఇచ్చారు. ఆయన కూడా ఓడిపోయాక నియోజకవర్గం లో అడ్రస్ లేకుండా పోయారు ఇలా పరుచూరు నియోజకవర్గంలో అసలు ఎవరిని నమ్మాలో తెలియక జగన్‌కు మైండ్ బ్లాక్ అవుతుంది. తాజా ఎన్నికల ఓడిపోయాక ఎడం బాలాజీ అమెరికా వెళ్ళిపోయారు. అసలు పార్టీ అధిష్టాన నేతల ఫోన్లు కూడా ఆయన ఎత్తడం లేదట. ఈ క్రమంలోనే జగన్ మరో కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చారు.
మూడు వరుస విజయాలతో పరుచూరును తన కంచుకోటగా మార్చుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై ఇప్పటికే కమ్మ - కాపు ప్రయోగాలు చేసి చేతులెత్తేసిన జగన్ ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మధుసూదన్ రెడ్డికి ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు. ఆయన మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు. గతంలో మధుసూదన్ రెడ్డి తండ్రి గాదె వెంకటరెడ్డి పర్చూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన బాపట్లకు మారిపోయారు. ఆయన స్వగ్రామం పరుచూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు మండల పరిధిలోకి వస్తోంది. ఏది ఏమైనా జగన్ వేసిన ఈ కొత్త ఈక్వేషన్ కూడా రాంగే అని వైసీపీ వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు.