
ఏపీ: పిఠాపురంలో వర్మ సరికొత్త వ్యూహం..జనసేనకు ఎదురుదెబ్బెనా..?
వర్మ అక్కడ ఇండిపెండెంట్గా నిలబడిన గెలిచే బలం కూడా ఉండదని 2014 ఎన్నికలలో నిరూపించడం జరిగింది. జనసేన విజయానికి వర్మ సహకరించారని చెప్పవచ్చు. అయితే అక్కడ బలంగా ఉన్న టిడిపి వర్మకు ఒక్కసారాగా ప్రాధాన్యత తగ్గిపోవడం జరిగిందట. చాలామంది జనసేన నేతలు కూడా సెటైర్లు వేయడంతో వర్మ గట్టిగానే రియాక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను చంద్రబాబు లోకేష్ మాత్రమే నమ్మానని ఈ ఇద్దరు ఎక్కడ తనకు అన్యాయం చేయాలని కూడా తెలిపారు. జనసేన నేతలు పిఠాపురం మా అడ్డ అన్న మాటలకు కౌంటర్లు కూడా వేస్తూ ఉన్నారు.
ఇక వర్మ అయితే ఎక్కడ తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో వర్మ పలుకుబడిని కాపాడుకోవడానికి తనని తాను ఏంటో నిరూపించుకోవడానికి కార్యకర్తల వద్దకే వెళుతూ ఉన్నారు.ఆయన ప్రజలతో కలిసిమెలిసి తిరుగుతూ వారి సమస్యలను అడుగుతున్నారట. మాజీ ఎమ్మెల్యేను కాబట్టి అన్ని విషయాలను పూర్తిగా అవగాహన ఉంటుంది అయితే ఇటీవలే మత్స్యకార గ్రామాలలో ఆయన తిరిగి వారి ఇళ్ల స్థలాలను కూడా ఇప్పిస్తానంటూ హామీ కూడా ఇచ్చారట. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇవన్నీ చూసుకోవలసి ఉన్నప్పటికీ ఆయన ఇచ్చిన అధికార హామీలు కూడా అమలు చేయవలసి ఉండగా ఆ హామీలను అమలు చేయకుండా ఉన్నారు. అయితే వర్మ మాత్రం అన్నిటినీ కూడా తానే చూసుకుంటానని జనంలో మరొకసారి టిడిపి జోష్ నింపేయాలా చేస్తున్నారట. మరి తాజా పరిణామాలు చూస్తే పిఠాపురంలో కూడా జనసేన టిడిపి మధ్య గట్టి పోటీ పడేటట్టు కనిపిస్తోంది.