నియోజకవర్గాల పునర్విభజన ప్రచారంలో అసలు నిజం ఇదే.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

frame నియోజకవర్గాల పునర్విభజన ప్రచారంలో అసలు నిజం ఇదే.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

Reddy P Rajasekhar
ప్రస్తుతం ఏపీతో పాటు ఇతర సౌత్ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన గురించి జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమస్య ఒక విధంగా దక్షిణాది ఉత్తరాది సమస్యగా మారింది. ఈ సమస్య గురించి పార్థసారథి పొట్లూరి మాట్లాడగా ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. డీ లిమిటేషన్ అనగా జనాభా ప్రాతిపదిన ఆ నియోజకవర్గాల్లో మార్పులు చేయడం అని ఆయన అన్నారు.
 
ఒక నియోజకవర్గంలో జనాభా ఎక్కువగా ఉండి పక్క నియోజకవర్గాల్లో జనాభా తక్కువ ఉంటే స్వల్పంగా మార్పులు చేస్తారని అలా కాకుండా అన్ని నియోజకవర్గాల్లో జనాభా ఎక్కువగా ఉంటే మాత్రం కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. డీ లిమిటేషన్ కోసం రాష్ట్రపతి ఒక కమిషన్ ను ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికల కమిషన్ కూడా ఉందుకోసం కలిసి పని చేస్తుంది.
 
డీ లిమిటేషన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలను కోర్టులో సైతం ఛాలెంజ్ చేయడానికి వీలు కాదు. లోక్ సభ నియోజకవర్గాలను పరిశీలించి మార్పులు చేయడం జరుగుతుంది. పునర్విభజనకు సంబంధించి మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. 2026 సంవత్సరంలో మళ్లీ డీ లిమిటేషన్ జరగనుందని జరగనుందని సమాచారం అందుతోంది.
 
ఉత్తర భారతంలో మొదటినుంచి జనాభా ఎక్కువేనని అయన పేర్కొన్నారు. డీ లిమిటేషన్ వల్ల సౌత్ లో ఎంపీ సీట్లు తగ్గవని మార్పులు ఉంటాయని ఆయన వెల్లడించారు. యూపీలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. సౌత్ లో సీట్ల సంఖ్య తగ్గదని అమిత్ షా క్లారిటీ ఇచ్చారని పార్థసారథి పొట్లూరి వెల్లడించడం గమనార్హం. రాబోయే రోజుల్లో డీ లిమిటేషన్ కు సంబంధించి ఎలాంటి వివాదాలు చోటు చేసుకుంటాయో చూడాలి. డీ లిమిటేషన్ గురించి కావాలనే కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: