బీజేపీ అధ్యక్ష రేసులో ఉంది వీరే? బండి సంజయ్ ని పక్కకి తప్పించారు గా?

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి ఎవరు అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.  ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగానూ కొనసాగుతున్నారు.   గత మూడు నాలుగేళ్లుగా రాష్ట్రంలో కమలం పార్టీ కొద్దికొద్దిగా బలపడింది.  అధినాయకత్వం కూడా తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ రాష్ట్రంలో ఎలా అయినా అధికారంలోకి రావాలని చూస్తోంది. ఈ క్రమంలో నూతన అధ్యక్షుడి కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది.  



బీజేపీ అధిష్టానం 2028 ఎన్నికలను టార్గెట్ చేసింది.  ఆ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్లాన్ చేసింది.  అధికార పీఠం దిశగా దూసుకుపోయే సమర్థుడి కోసం వేట సాగిస్తోంది. ఇదే క్రమంలో అధ్యక్షుడి పీఠం ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. బీజేపీ స్టేట్ చీఫ్ కోసం పోటాపోటీ నెలకొంది.  


కేంద్రంలో బీజేపీ మూడో సారి అధికారం చేపట్టింది. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.  ప్రధానంగా తెలంగాణలో మరిన్ని ఎక్కువ అనుకూల పరిస్థితులు ఉన్నాయి.  కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో ఉండడంతో కొత్త అధ్యక్షుడి నియామకంతోపాటు బూత్ స్థాయిలో సంస్థాగత మార్పులకు బీజేపీ సిద్ధం అవుతున్నట్లు సమాచారం.


అధ్యక్షుడి రేసులో  ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, ఎన్.రాంచంద్రారావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా గెలిచారు. అయితే.. ఆయనకే పార్టీ పగ్గాలు దక్కబోతున్నాయని మొన్నటివరకు బలంగా ప్రచారం సాగింది.

కేంద్ర కేబినెట్‌లో చోటు ఆశించిన పాలమూరు ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం ఉంది.  మహిళకు పార్టీ బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు అధిష్టానం చేసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ప్రస్తుతం ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.  పైగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఇలాకాలో ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు. దీంతో ఆమె పేరును సైతం పార్టీ పరిశీలిస్తున్నది.


ఇక.. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు సైతం పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని చూస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలో విజయం సాధించడం ఆయనకు కలిసి వచ్చే అంశాలు.  అలాగే.. ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొట్టడంలోనూ ఆయనకు ఆయనే సాటి. దాంతో రఘునందన్ పేరు కూడా అధిష్టానం దృష్టిలో ఉన్నట్లు టాక్.


నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి వరుసగా రెండోసారి గెలుపొందారు ధర్మపురి అర్వింద్. ఆయన కూడా కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఆశించి భంగపడ్డారు. బీజేపీ ఫైర్ బ్రాండ్‌గా ఆయన పేరుగాంచారు. ఇప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారట. మరోవైపు  బండి సంజయ్ పేరు సైతం ప్రధానంగా వినిపించింది. కానీ.. దీనిపై నిన్ననే సంజయ్ క్లారిటీ ఇచ్చారు.  తాను అధ్యక్ష పదవి రేసులో లేనని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: