చాలామంది హీరోయిన్లు హిట్ ట్రాక్ లో ఉన్న సమయంలోనే కొంతమంది దర్శకుల చేతిలో పడి సినీ కెరీర్ ని నాశనం చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఆ హీరోయిన్లు ఆ దర్శకుల వల్ల తమ సినీ కెరియర్ నాశనం అయిందని వాళ్ళు చేయమన్న పాత్రలు చేసి మా సినీ కెరియర్ ని నాశనం చేసుకున్నామని ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలా హీరోయిన్ రాశి,నటి అర్చన ఇలా ఎంతో మంది హీరోయిన్లు బహిరంగంగానే తమ సినీ కెరీర్ నాశనం అవ్వడానికి ఎవరు కారణమయ్యారో వారి పేర్లు చెప్పారు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ కూడా తన సినీ కెరీర్ నాశనం అవ్వడానికి ఆ ఇద్దరే కారణం అంటూ ఓ సంచలన విషయాన్ని బయట పెట్టింది.
ఇక ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే పార్వతి మెల్టన్.. ఈ నటి పేరు చెప్పగానే అందరికీ జల్సా మూవీ గుర్తుకొస్తుంది.జల్సా మూవీలో పవన్ కళ్యాణ్ సరసన మెయిన్ హీరోయిన్ గా ఇలియానా చేసినప్పటికీ గుర్తింపు మాత్రం పార్వతి మెల్టన్ కి వచ్చింది.. పార్వతి మెల్టన్ తన సినీ కెరియర్లో వెన్నెల, మధు మాసం,అల్లరే అల్లరి, గేమ్, శ్రీమన్నారాయణ వంటి సినిమాల్లో చేసింది. అలాగే దూకుడు మూవీలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వస్తున్న తరుణంలోనే ఇద్దరు డైరెక్టర్ల కారణంగా తన సినీ కెరియర్ నాశనం అయ్యింది అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పార్వతి మెల్టన్ చెప్పుకొని బాధపడింది.
నా సినీ జీవితం నాశనం అవ్వడానికి కారణం ఆ ఇద్దరు డైరెక్టర్లే. కానీ ఆ ఇద్దరు డైరెక్టర్ల పేర్లు చెప్పడానికి నాకు ప్రస్తుతం ఇష్టం లేదు. కానీ వారి వల్లే నా సినీ కెరియర్ నాశనమైంది అంటూ పార్వతి మెల్టన్ షాకింగ్ కామెంట్లు చేసింది. అయితే పార్వతీ మెల్టన్ సినీ కెరీర్ నాశనం అవ్వడానికి అప్పట్లో కొంతమంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి.ఆ డైరెక్టర్లు ఎవరో సినీ ఇండస్ట్రీ గురించి తెలిసిన చాలా మందికి తెలుసు. ఇక పార్వతి మెల్టన్ 2013లో శంసులాలాని ని పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది