ఆ హీరోయిన్ అంటే చచ్చేంత ఇష్టం.. పేరుని పచ్చబొట్టు పొడిపించుకోవాలి అనుకున్న జూనియర్ ఎన్టీఆర్..!?

Thota Jaya Madhuri
జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్తే ఆనందంతో ఎగిరి గంతులేసే జనాల కన్నా కూడా ఆలోచించి అభిమానించే జనాలు ఎక్కువగా ఉంటారు. అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.  జూనియర్ ఎన్టీఆర్ కూడా కొన్ని కాంట్రవర్షియల్ విషయాలలో ఇరుక్కున్నారు . కానీ ఎప్పుడూ కూడా టంగ్ స్లిప్ అవుతూ మాట్లాడలేదు . ఆయన స్థాయికి ఆయన అభిమానులకి ఎప్పుడు ఆటంకం కలిగే విధంగా ప్రవర్తించలేదు . కాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ ల విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో అందరికీ తెలుసు. ఏ హీరోయిన్ ని ఎలా సినిమాకి ఒప్పించాలి.. ఏ హీరోయిన్ తో ఎలా ముందుకెళ్లాలి అన్న విషయాలు కూడా జూనియర్ ఎన్టీఆర్ కి బాగా తెలుసు .


అయితే జూనియర్ ఎన్టీఆర్ కి ఓ హీరోయిన్ అంటే చాలా చాలా ఇష్టం . ఎంత ఇష్టమంటే జూనియర్ ఎన్టీఆర్ ఆ హీరోయిన్ పేరుని ఏకంగా పచ్చబొట్టు పడిపించుకోవాలి అని అనుకున్నాడట. ఆ హీరోయిన్ మరెవరో కాదు సావిత్రి . మహానటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సావిత్రి గారు అంటే మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కి చాలా చాలా ఇష్టం . మరీ ముఖ్యంగా తన తాతగారు ఆమె కలిసిన నటించిన సినిమాలు ఇంట్రెస్టింగ్ గా చూసేవారట .


అసలు జూనియర్ ఎన్టీఆర్ నటుడు అవ్వాలి అని కోరుకున్నదే తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని చూసి అంటూ చాలా సందర్భాలలో బయటపడింది . మొదటి నుంచి సావిత్రి గారు నటన అంటే చాలా ఇష్టంగానే జూనియర్ ఉండేవాడు. అందుకే ఎన్టీఆర్ చిన్నతనంలోనే ఆమె పేరు పచ్చబొట్టు పొడిపిమచుకోవాలి ఆమె పేరు అంటూ ఆశ పడ్డారట . కానీ తారక్ అమ్మ మాత్రం అస్సలు ఒప్పుకోలేదట . అలా అంత చేయకూడదు తారక్ అంటూ కూసింత గట్టిగానే మందలిచ్చిందట.  ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పెరిగి పెద్దయి ఇండస్ట్రీలో హీరోగా మారాడు . ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరుని పలువురు జనాలు కూడా పచ్చబొట్టు పొడి పించుకునే అంత స్థాయికి ఎదిగిపోయాడు . త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో థియేటర్స్ లో దర్శనం ఇవ్వబోతున్నారు.  ఈ సినిమాతో చరిత్ర సృష్టించబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ జనాలు బాగా ధీమా వ్యక్తం చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: